భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వర్ధంతి
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌. ఆయన అసలుపేరు ‘మొహియుద్దీన్‌ అహ్మద్‌’, ‘అబుల్‌ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్‌’ కలంపేరు. ఆలియా బేగమ్‌, ఖైరుద్దీన్‌ అహమ్మద్‌ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు. ఖిలాఫత్‌ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. ఆయన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. నవంబర్‌ 11న ఆయన జన్మదినం సందర్భంగా మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15 నుండి అంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1958 ఫిబ్రవరి 2 వరకు కేంద్ర విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈయనకు భారతరత్న అవార్డు సైతం ఇచ్చింది. అంతేకాదు ఈయన పేరిట పలు విద్యాసంస్థలు కూడా నెలకొల్పబడ్డాయి. అబుల్‌ కలాం మంత్రిగా ఉన్న సమయంలో ఢల్లీిలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సహా భారతదేశం అంతటా వివిధ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈయన సేవలకు గుర్తుగా 2008లో భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్ణయించింది. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ మక్కానగరంలో 1888 నవంబరు 11 న జన్మించాడు. అతని వంశస్థులు బాబర్‌ రోజుల్లో హేరాత్‌ (ఆఫ్ఘనిస్తాన్లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్‌ ముస్లిం పండితులు, లేదా మౌలానాల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్‌, షేక్‌ మహ్మద్‌ జహీర్‌ వత్రి, అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్‌ ఆఫ్ఘన్‌ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్‌ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వెళ్లాడు. ఆజాద్‌ సంప్రదాయ ఇస్లామిక్‌ విద్య అభ్యసించాడు. అతని విద్య ఇంట్లోనే సాగింది. మొదట తండ్రి, పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్‌ మొదట అరబిక్‌, పెర్షియన్‌ నేర్చుకున్నాడు. తరువాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అభ్యసించాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్‌, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు.ఆజాద్‌ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందాడు.అతను దివ్య ఖురాన్‌ పై భాష్యం వ్రాసాడు.. అతను జమాలుద్దిన్‌ ఆఫ్ఘానీ పాన్‌`ఇస్లామిక్‌ సిద్ధాంతాలలో, అలిగర్‌ సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆలోచనలో ఆసక్తి చూపేవాడు. పాన్‌`ఇస్లామిక్‌ భావాలతో అతను ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, ఈజిప్ట్‌, సిరియా, టర్కీ సందర్శించాడు.ఇరాక్‌ లో అతను ఇరాన్‌ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటం సల్పుతున్న నిర్వాసిత విప్లవ కారులను కలుసుకున్నాడు. ఈజిప్ట్‌ లో అతను షేక్‌ ముహమ్మద్‌ అబ్దుప్‌ా, సయీద్‌ పాషా వంటి అరబ్‌ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్‌ టర్క్స్‌ భావాలతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాదిగా రూపాంతరం చెందించాయి.విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్‌, బెంగాల్‌ కు చెందిన అరవింద ఘోష్‌, శ్రీ శ్యాం సుందర్‌ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్‌, బీహార్‌ లకు పరిమితం అగుట ఆజాద్‌ కు తెలిసి రెండు సంవత్సరాల లోపల, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఆసమయంలో విప్లవ వాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తుందని భావించాడు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించాడు.1912 లో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఉర్దూలో ‘ అల్‌ హిలాల్‌’ వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్‌ హిలాల్‌ మోర్లే`మింటో సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం`ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ‘అల్‌ హిలాల్‌’ అతివాద భావనల ఒక విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా ‘‘అల్‌` హిలాల్‌’’ను భావిస్తింది. ప్రభుత్వం దానిని 1914 లో నిషేధించింది.ఆజాద్‌ భారతీయ జాతీయ వాదం, హిందూ `ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను ‘‘అల్‌ బలఫ్‌ు’’ ప్రారంభించారు.1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు, రాంచిలో ఆజాద్‌ ను నిర్భందించారు. ఆతరువాత మొదటి ప్రపంచ యుద్ధం 1920 తర్వాత విడుదల చేసారు. విడుదల తరువాత ఆజాద్‌ ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్‌ వ్యతిరేక భావాలు పెంచారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గాంధీజీ ప్రారంభించిన ‘‘సహాయ నిరాకరణ’’ ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత జాతీయ కాంగ్రెస్‌ లో చేరాడు.ఇతడు ఢల్లీి కాంగ్రెస్‌ ప్రత్యేక సెషన్‌ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యాడు.మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 1940 (రాంగడ్‌) లో కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు , 1946 వరకు ఆ పదవిలో ఉన్నాడు.అతను విభజనకు వ్యతిరేకి. విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు , ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కలను నాశనం చేసి అతనిని విపరీతంగా బాధించింది.మౌలానా ఆజాద్‌ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 లో అరెస్టు అయ్యాడు. అతనిని ఒక సంవత్సరంన్నర పాటు విూరట్‌ జైల్లో ఉంచారు. ఖిలాఫత్‌ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు.1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ మరణించాడు. గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ , నెహ్రూ ఇతడిని మౌలానా, విూర్‌`ఎ`కారవాన్‌ అని పిలిచేవాడు. భారత ప్రభుత్వం ఆయన మరణానంతరం 1992లో అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *