ఉద్ధృతంగా కొనసాగుతోన్న కర్ణాటక రాష్ట్ర బంద్‌
సాధారణ జన జీవనానికి తీవ్ర ఆంటకాలు
ఎక్కడికక్కడ స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ
బెంగళూర్‌ సెప్టెంబర్‌ 29: పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంద్‌ ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్‌ కారణంగా సాధారణ జన జీవనానికి తీవ్ర ఆంటకాలు ఏర్పడ్డాయి. బంద్‌కు మద్దతుగా నగరంలోని హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.ఈ బంద్‌ విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడిరది. నేడు బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 44 విమానాలను అధికారులు రద్దు చేశారు. అందులో 22 విమానాలు ల్యాండ్‌ కావాల్సి ఉండగా.. మరో 22 విమానాలు టేకాఫ్‌ చేయాల్సి ఉంది. బంద్‌ కారణంగా అధికారులు విమానాల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగానే అందజేశారు. ఇక కర్ణాటక బంద్‌ కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను ముందుగానే రద్దు చేసుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు.మరోవైపు ఈ బంద్‌కు కర్ణాటక రక్షణ వేదికె, హసిరు సేన, జయ కర్ణాటక సంఘం సహా మొత్తం 1,900 సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి బంద్‌ పాటిస్తున్నారు. బెంగళూరు నగరంతోపాటు పలు ప్రధాన ప్రాంతాల్లోనూ బంద్‌ కొనసాగుతోంది. చిక్కమంగళూరులో నిరసనకారులు ద్విచక్రవాహనాల్లో పెట్రోల్‌ బంకుల్లోకి ప్రవేశించి ఆందోళన చేపట్టారు. ఇక మండ్యలో నిరసరకారులు రోడ్లపైకి వచ్చి కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్‌ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. వారిని అరెస్ట్‌ చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఈ బంద్‌ కొనసాగనుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *