న్యూ డిల్లీ ఫిబ్రవరి 13:పెండిరగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వేలాది మంది రైతులు ఢల్లీి సరిహద్దులకు చేరుకున్నారు. కేంద్రమంత్రులతో అర్ధరాత్రి జరిగిన సమావేశం అసంపూర్తిగా మారడంతో పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు టెంట్లు, వంట సామగ్రి, ఇతర వస్తువులతో ఢల్లీికి బయలుదేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ఈ విషయంలో సంప్రదింపులు అవసరమని, ఇందుకోసం రాష్ట్రాలతో మాట్లాడాలన్నారు. చర్చలకు, పరిష్కారాలను కనుగొనేందుకు తమకు ఓ వేదిక అవసరమన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని, రైతు సంఘాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వానికి సమాచారం అందిందని.. దాన్ని నివారించాలని రైతులకు చెప్పాలనుకుంటున్నానన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని.. కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. తాము కొన్ని సమస్యలకు పరిష్కారాలను వెతుకుతున్నామన్నారు. అయితే, గతంలో వ్యవసాయ చట్టాలను తీసుకురాగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి హావిూ ఇచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు సమస్యల పరిష్కారానికి ముందుకురాకపోవడంతో మరోసారి సంయుక్త కిసాన్ మోర్చా మరోసారి ఛలో ఢల్లీికి పిలుపునిచ్చింది.రైతులు కనీస మద్దతు ధర (ఓూఖ) చట్టంతోపాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతు, వ్యవసాయ కూలీలకు పెన్షన్, రుణమాఫీ, పోలీసులు నమోదు చేసిన కేసులు ఉపసంహరణ, లఖింపూర్ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తున్నది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం రైతుల ప్రతినిధులతో భేటీ అయ్యారు. రైతుల డిమాండ్లపై జరిగిన ఈ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. మరో వైపు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు అంబాలా`శంభు, ఖనౌరీ`జింద్, దబ్వాలి సరిహద్దుల నుంచి ఢల్లీికి వెళ్లాలని నిర్ణయించారు.