న్యూ డిల్లీ ఫిబ్రవరి 13:Ñతాము పండిరచిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ‘ఛలో ఢల్లీి’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ‘ఛలో ఢల్లీి’ కార్యక్రమంలో భాగంగా పంజాబ్`హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్‌కు రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా పోలీసులు వచ్చినవాళ్లను వచ్చినట్టే అరెస్ట్ చేసి స్టేషన్‌లకు తరలించారు.కానీ, కాసేపటికే రైతుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగడంతో అరెస్టులు సాధ్యం కాలేదు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.