విశాఖపట్నం:విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేంజ్ ఎస్పీలతో సవిూక్ష నిర్వహిస్తున్నానని.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పోలీసు సేవలు అందించాలన్నారు. ఆరు నెలలు యన్‌డీపీఎస్ కేసులు విూద మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నందున ఏజెన్సీ ఏరియాలో మరింత దృష్టి పెడతామన్నారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని విశాల్ గున్ని పేర్కొ?న్నారు. విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్టు నూతన డీఐజీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు ఆయన చెప్పారు.