కోవూరు. ఫిబ్రవరి 13:నాయకులు ప్రతి కార్యకర్త ఒక సైనికుని ల పనిచేసి జగన్మోహన్‌ రెడ్డి ని మరల
గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కోవూరు లోని పివిఆర్‌ పంక్షన్‌ హల్‌ నందు మండలం లోని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతోఆత్మీయసమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో వైసిపి పార్టీ గెలుపు తద్యమని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన సర్వేలు సైతం వైసీపీ పార్టీ గెలవబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరు చలపతిరావు, నిరంజన్‌ బాబు రెడ్డి,రాధాకృష్ణారెడ్డి, జడ్పిటిసి పార్వతి, కవరగిరి శ్రీలత, వైసిపి నాయకులు సచివాలయ కన్వీనర్‌ కవరగిరి ప్రసాద్‌, కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *