న్యూ ఢల్లీి : బీజేపీ అగ్రనేత అద్వానీ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు.ఎల్‌.కె.అద్వానీ పూర్తిపేరు లాల్‌ కృష్ణ అద్వానీ. 1927 నవంబర్‌ 8న పాకిస్థాన్లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్లో పాఠశాల విద్య, పాక్లోని హైదరాబాద్లో డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్య చదివారు. 1947లో ఆరెస్సెస్‌ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు చేపట్టారు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్‌ 12న భారత్‌ కు అద్వానీ వలసవచ్చారు. 1957లో ఆరెస్సెస్‌ పిలుపుతో ఢల్లీికి అద్వానీ వచ్చారు. 1960లో ఆర్గనైజర్‌ పత్రికలో జర్నలిస్టుగా అద్వానీ విధులు నిర్వహించారు. 1966లో ఢల్లీి మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికలో విజయం సాధించారు. 1977లో ఢల్లీి మెట్రోపాలిటిన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. 1970`72లో భారతీయ జనసంఫ్‌ు ఢల్లీి విభాగం అధ్యక్షుడిగా అద్వానీ బాధ్యతలు చేపట్టారు. 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికైయారు. 1973`76లో జన్సంఫ్‌ు అధ్యక్షుడయ్యారు. 1974బి76లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత. 1977`80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి. జనతా పార్టీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వున్నారు. 1977`79 వరకూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వున్నారు. 1980 ఏప్రిల్‌ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1996లో 13 రోజులకే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడంతో 1998లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసారు. 1999 ఎన్నికల్లో గెలిచి వాజ్పేయూ సర్కార్‌ లో కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉపప్రధానిగా అద్వానీ విధులు నిర్వహించారు. కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా అడ్వాణీకి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిత్వగా అద్వానీకి అదనపు బాధ్యతలు ఇచ్చారు. 2004లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసారుర. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా అద్వానీ పోటీ చేసారు. 2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గాంధీనగర్‌ నుంచి అద్వానీ గెలిచారు. ` 2019లో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమైయారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *