హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో డిజిటల్ విూడియాను భారీగా వాడుకున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి సోషల్ విూడియాతో ప్రజల్లోకి వెళ్లారు. అంతో కాకుండా ఫేస్ బుక్, గూగుల్ కూడా పార్టీలు భారీగా ప్రకటనలు ఇచ్చాయి. వందల కోట్ల రూపాయలను ప్రకటనల కోసమే ఉపయోగించాయి. దీంతో గూగుల్, ఫేస్ బుక్ పై కాసుల వర్షం కురిసింది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు.. ఈ ఏడాది రాజకీయ పార్టీలు గూగుల్, ఫేస్ బుక్ లకు అక్షరాల 450 కోట్ల రూపాయల యాడ్స్ వచ్చినట్లు చెబుతున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ ప్రచారం ముగిసేంత వరకు.. అధికారికంగా.. నేరుగా గూగుల్, ఫేస్ బుక్ లకు అన్ని పార్టీలు కలిపి 25 కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో గూగుల్ వాటా 20 కోట్లుగా ఉంటే.. ఫేస్ బుక్ వాటా 5 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేందుకు గతంలో జరిగిన జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లోనూ 5 కోట్ల రూపాయలపైనే అన్ని పార్టీలు యాడ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీల వారీగా చూస్తే గూగుల్, ఫేస్ బుక్ లకు బీఆర్‌ఎస్ ఎక్కువగా యాడ్స్ ఇచ్చి మొదటి స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. బీజేపీ తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో యాడ్స్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి 52 స్లాట్స్ లో ప్రకటనలు ఇచ్చాయి. నవంబర్ లో గూగుల్, ఫేస్ బుక్ తెలుగు రాష్ట్రాల్లో నడిపే యాడ్ స్లాట్స్ లో 57 శాతం పార్టీలు ప్రకటనల కోసం బుక్ చేసుకున్నాయి. వీడియో, ఇమేజ్ లతోపాటు వెబ్ సైట్స్, ఫేస్ బుక్ పేజీలు స్పాన్సర్డులు ఉన్నాయి. ఈ ప్రకటనల కోసం రాజకీయ పార్టీలు రూ.25 కోట్లు ఖర్చు చేశాయి. ఇటు టీవీ ఛానళ్లల్లో కూడా భారీగా ప్రకటనలు ఇచ్చాయి. మొన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు కూడా పార్టీలు స్టార్ టీవీ, హట్ స్టార్ లో ప్రకటనలు ఇచ్చాయి. న్యూస్ ఛానళ్లతో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లలో కూడా ప్రకటనలు ఇచ్చారు.