భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్స్‌ మేరకు 1966 నవంబరు 16 వ తేదిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేసారు, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబరు 16వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రేస్‌ కౌన్సిల్‌ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం, అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ కోసం పని చేయాలన్నది లక్ష్యం.
ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్‌ కౌన్సిళ్లు ఉన్నాయి. అయితే మనదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకతేమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది. పత్రికలు, విూడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్‌ కౌన్సిల్‌ ప్రోత్సహిస్తుంది.
పన్నెండేళ్లుగా ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతీ నవంబరు 16న సెమినార్లు నిర్వహిస్తున్నది.
అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినంగా మే 3వ తేదీని ప్రకటించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *