ఇన్ని ఆంక్షలమధ్య జర్నలిస్ట్‌లకు ఇంటిస్థలాలు వచ్చేనా.!?,పార్టీలకు అతీతంగా ఆలోచించండి,చర్చించండి ఫ్రెన్‌డ్స్
అన్నమయ్య జిల్లా :అధికారపక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి పోలీసులు తీసుకెళ్లుతున్నప్పుడు జర్నలిస్టులు అవసరం.అధికారులపై అధికారపక్షనాయకులో,అల్లరి మూకలో దాడికి ప్రయత్నించినప్పుడు (అధికారులకు) జర్నలిస్టులు అవసరం.అలాంటి (మీడియాకు) జర్నలిస్టులకు చట్టప్రకారం ప్రభుత్వంనుంచి రావాలస్సిన సంక్షేమ పథకాలకు అధికారులు,ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు.
జర్నలిస్టులందరికి విన్నపం అయ్యా ఈ సొసైటీలో ఎటువంటి ఆశలేకుండా,జీవితంలో రాజీ పడి బతుకున్న వారు ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క జర్నలిస్టులే అని చెప్పడానికి నేను గర్కిస్తున్నాను.సమయానికి కూడు,గూడులేని,ఆదాయంలేని వృత్తి.ఎప్పుడు,ఎక్కడ ఏ సంఘటన చోటుచేసుకున్న అధికారులకంటే ముందుగా వుండేవారే జర్నలిస్టులు.ఈ వృత్తిలోకి పేద,మధ్య తరగతి వారే ఎక్కువశాతం వస్తున్నారు. ఈ వృత్తిలోకి ఒకసారి వచ్చిన తరువాత ఆదాయంలేక,యాజమాన్యం,ప్రభుత్వం నుంచి ఆధరణ కు నోచుకోక అనేక అవస్థలు పడుతున్నారు.ఆధునిక యుగంలో సంపన్నవర్గాల వారితో పోటీ పడలేక,‘తమ పిల్లల కోరికలు తీర్చలేక మనకంటే కింది(పేద)వారిని చూసి వారితో పోలిస్తే మేము నయం అని రాజీపడి బతుకీడుస్తున్నాం.దశాబ్ధాలుగా ‘‘మన సమస్యలను( ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇంటిస్థలం,తదితర సమస్యలు మనం పరిష్కరించుకోలేక పోతున్నాం. మనచుట్టూ వున్న సమస్యలును మనం వేలెత్తి చూపుతూ పరిష్కార మార్గం వైపు వెలుతున్నాం, మన సమస్యల పట్ల ఏ ప్రభుత్వం స్పందించడంలేదు. విధినిర్వహణలో గాయపడినా,మృతిచెందినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.గాయపడినా,మృతిచెందినా సాటి విలేకరని మనకున్నదానిలో మనమే మన జర్నలిస్టులను ఆదుకున్న రోజులన్నాయి.
కులం,మతం,ప్రాంతాలకు అతీతంగా మనం విధులు నిర్వహిస్తున్నాం. ‘‘మనకు,మన కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే ఇటు ప్రజాప్రతినిధులు సానుభూతి చూపడంతప్ప చేసేది ఏమిలేదు,అటు ప్రభుత్వం,అధికాలు పట్టించకున్న పాపాన పోవడంలేదు. ఇవన్నీ రాష్ట్రవ్యాప్తంగా వున్న సమస్యలని జర్నలిస్టులకు,జర్నలిస్టు సంఘాలకు,ప్రభుత్వాలకు తెలిసిన రహస్యం. ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీవారు జర్నలిస్టులపై సానుభూతి చూపి విలేకరులను నిచ్చేనలాగా వాడుకుని వారి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత వారికి మనం అవసరం లేదు, మళ్లీ ఎలెక్షన్‌లకు 4నెలలో 6నెలలో ముందు మనం ప్రభుత్వానికి,ప్రజాప్రతినిధులకు గుర్తువస్తాం.అంతదూరం ఎందుకు రాయచోటిలో 2010 సంవత్సరంలో ఏజీ గార్డన్‌లో విలేకరులకు మంజూరు చేసిన స్థలాలు కోర్టులో వున్నాయి. 13 సంవత్సరాలు అవుతున్నా ఆ సమస్య పరిష్కారం కాలేదు.ఆ పట్టాలు మాత్ర పేద,మధ్య తరగతి విలేకరులు బీరువాలో దాచుకుని మురిసిపోతున్నారు.ఏప్పటికైనా తమకు ప్రభుత్వం ఇంకోచోటు ఇంటిస్థలం ఇస్తుందనే ఆశతో రోడ్డుపై నిలబడిపోయారు.
ఇలా చెప్పుకుంటూ పోతే మరో రెండు పేజీల బాధను పంచుకోవచ్చు:
ఇప్పటికైనా జర్నలిస్టు యూనియన్ల నాయకులు,జిల్లా ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించాలి. జర్నలిస్టులు కుల,మతాలకు,పార్టీలకు అతీతంగా పనిచేసి తమసమస్యలను పరిష్కరించుకోవాలి.ప్రతి జర్నలిస్టుకు ఒక పార్టీ,ఒక ప్రజాప్రతినిధు అంటే అభిమానం వుండొచ్చు అది వారి వారి ఇష్టం,వారికే ఓటు వేసుకోవచ్చ.జర్నలిస్టుల మంచి కోసం ఏవరు ఏది చెప్పినా వీడు పలానా పార్టీ వ్యక్తి అని నిందలు వేస్తున్నారు,అందుకే చట్టపరంగా జర్నలిస్టులకు రావాల్సిన పథకాలు రావడంలేదు. ప్రభుత్వం వారు ఇంటి స్థలం ఇస్తారని, మన పెద్దలు ఇచ్చిన సెంటో,అరసెంటో స్థలం ఇతరులకు రాసివ్వాలేమో చెప్పండి.ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ఎంతమందికి నిజాయితిగా ఇంటిస్థలాలు వస్తాయో ఆలోచించండి.
ఇన్ని ఆంక్షలమధ్య జర్నలిస్ట్‌లకు ఇంటిస్థలాలు వచ్చేనా.!?. నాలుగున్నర సంవత్సరాలు ప్రభుత్వానికి గుర్తుకురాని జర్నలిస్టులు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చినట్లు.గత 15,20సంవత్సరాలుగా జర్నలిస్టుగా(అక్రిడిటేషన్ కలిగి) పనిచేసి ఈ సంవత్సరంలో అక్రిడిటేషన్ లేని వారి పరిస్థితి ఏంటి?.ఇళ్లు, ఇంటిస్థలం ఉన్నజర్నలిస్టులు ప్రభుత్వం మంజూరు చేసే ఇంటిస్థలానికి అర్హులు కాదంటున్నారు. ‘‘మన వారసత్వంగా తాతనుంచో,తండ్రినుంచో, భార్య వైపునుంచి ఏవైనా సెంటుస్థలం,లేక ఇళ్లో ఉంటే వారి పరిస్థితి ఏంటి.!?.ఆలోచించండి నేస్తాలు.మీకు అభిమానం ఏ పార్టీవైపు వున్నా ఆ పార్టీకి ఓటు వేసుకోండి,ఇక్కడ పార్టీలు అంటకట్టవద్దండి. కారణాలు ఏవైనా సమస్య పరిష్కారమార్గం వైపు పయనించండి.
“జర్నలిస్ట్ గా” తన బిడ్డకు హాస్టల్ ఫీజు కట్ట లేక శని వారం తహశీ్దార్ కార్యాలయంలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్న చంద్ర