విజయవాడ: త్రిబుల్‌ తలాక్‌,మెహరం ఉచిత హాజ్‌ యాత్ర, మహిళా బిల్లు ల పై మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ మోర్చా మహిళా నాయకురాలు డాక్టర్‌ జాఫ్రిన్‌ మెహుజా బిన్‌ రాష్ట్ర మైనారిటీ నాయకులు ,మహిళలు.. మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు.జాతీయ మైనార్టీ మోర్చాశాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ల కార్యాయాలయాల్లో మోడీజి శుక్రియా వినతి పత్రాలు సమర్పించారు.అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఫ్లెక్సీ పై షుక్రియ మోడీ జీ అని సంతకాల సేకరణ చేసిన మైనారిటీ మోర్చా మహిళా నాయకులు… ఈ సంతకాల సేకరణ ను మైనార్టీ మోర్చా జాతీయ నాయకురాలు డాక్టర్‌ జాఫ్రిన్‌ మెహుజా బిన్‌ ప్రారంభించారు. వందల సంఖ్యలో తరలి వచ్చిన ముస్లిం మహిళలు సంతకాలు చేసారు.బిజెపి మహిళా మోర్చా జాతీయ నాయకురాలు డాక్టర్‌ జాఫ్రిన్‌ మెహజా బిన్‌ విూడియా తో మాట్లాడుతూ త్రిబుల్‌ తలాక్‌,మెహరం ఉచిత హాజ్‌ యాత్ర, మహిళా బిల్స్‌ పై మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలుపుతు ప్రతి రాష్ట్రంలోను ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే అస్సాం, త్రిపుర, ఒరిస్సా చత్తీస్‌ ఘడ్‌ తదితర రాష్ట్రాల్లో చేయడం జరిగిందన్నారు.నరేంద్ర మోడీ అధ్వర్యంలో మైనారిటీ లను పెద్దపీట వేశారు దశాభ్ధాల తరబడి పరిష్కారం కాని సమస్యలకు ప్రధాని నరేంద్రమోదీ పరిష్కారం చూపారు. నరేంద్రమోదీ వెనకనే ముస్లిం మహిళలు ఉన్నారు. ముస్లిం మహిళలకు నరేంద్రమోదీ పెద్ద పీట వేశారన్నారు.త్రిబుల్‌ తలాక్‌ ద్వారా పెళ్ళయిన ఆడపిల్లలకు తలాక్‌ ఇవ్వకుండా త్రిబుల్‌ తలాక్‌ బిల్లు తీసుకువచ్చిన ఘనత బిజెపి ప్రభత్వానికే దక్కుతున్దనారు. ఈ బిల్లు తీసుకుని రావడం లో నరేంద్రమోదీ సాహసోపేతం ప్రదర్శించారన్నారు అదేవిధంగా పేద ముస్లింలు హజ్‌ యాత్రకు కేంద్రం ఇస్తోన్న సహకారం ప్రతి ముస్లిం మరవరన్నారు అదేవిధంగా పార్లమెంటు లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన తీరు యావత్తు మహిళా లోకం మరవదన్నారు. మహిళలు ప్రధాని నరేంద్రమోదీకి నీరాజనాలు పట్టాలన్నారు.ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డైనమిక్‌ లీడర్‌ అని శ్లాఘించారు. పురందేశ్వరి గతంలో మైనార్టీ విభాగానికి ఇంచార్జిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి విజయవాడ కలెక్టరేట్‌ కు వెళ్లి వినతిని అందించారు. కలెక్టరేట్‌ లోని డిఆర్‌ ఓ వినతి పత్రాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ బాషా, కార్యదర్శి యాస్మిన్‌, జాతీయ మైనార్టీ మోర్చా సుఫీ సంవాద్‌ చైర్మన్‌ సయ్యద్‌ అబ్రార్‌ అహ్మద్‌, సయ్యద్‌ కరీముల్లా, ఖాజా ఆలీ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *