పాట్నా, నవంబర్‌ 9: జనాభా నియంత్రణపై బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు స్పందించారు. మహిళలపై అంత నీచంగా మాట్లాడిన నితీశ్‌ వ్యాఖ్యల్ని విపక్ష కూటమి నేతలు ఎందుకు ఖండిరచడం లేదంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. ఈ క్రమంలోనే…కాంగ్రెస్‌ విమర్శలు గుప్పింది. ఇప్పటి వరకూ ఎవరూ అలాంటి భాష మాట్లాడలేదని మండి పడ్డారు కాంగ్రెస్‌ నేత పి చిదంబరం ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నారు. ‘‘నితీశ్‌ కుమార్‌ నోరు జారారు. ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా సారీ చెప్పారు. కానీ…దేశంలో మరెక్కడా ఇలాంటి భాష వాడకూడదు’’` పి చిదంబరం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత
నితీశ్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు వరస పెట్టి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మండి పడ్డారు. విపక్ష కూటమి నేతలు ఎందుకు స్పందించడం లేదో విూడియా ప్రశ్నించాలని అన్నారు. ‘‘నితీశ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గు చేటు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ సీనియర్‌ నేత ఇలాంటి మాటలు మాట్లాడడం అవమానకరం. మహిళలపై అసెంబ్లీలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు ఎందుకు స్పందించడం లేదు. ఎందుకు ఖండిరచడం లేదు. విూడియా అంతా వాళ్లను ప్రశ్నించాలి’’
ఆగని విమర్శలు:
బీజేపీ నేత బన్సూరీ స్వరాజ్‌ కూడా నితీశ్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి తప్పుల్ని క్షమించకూడదని తేల్చి చెప్పారు. మహిళలను గౌరవించడం బీజేపీ సిద్ధాంతం అని స్పష్టం చేశారు. ‘‘నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యల్ని అసలు క్షమించకూడదు. మహిళల్ని గౌరవించడం బీజేపీ సిద్ధాంతం. మన దేశ రాజకీయాల్లోనే సీనియర్‌ నేత ఆయన. కానీ ఆ విషయం మర్చిపోయి సీఎం పదవిలో ఉండి కూడా అలాంటి మాటలు మాట్లాడారు’’
తప్పు పట్టిన అమెరికన్‌ సింగర్‌ :
జనాభా నియంత్రణపై అసెంబ్లీలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పినా…జరగాల్సిన డ్యామేజ్‌ అప్పటికే జరిగిపోయింది. ప్రతిపక్షంలోని మహిళా నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం ఇక్కడికే పరిమితం కాలేదు. అమెరికా వరకూ వెళ్లింది. ఆఫ్రికన్‌`అమెరికన్‌ సింగర్‌ మేరీ మిల్‌బెన్‌ ఈ వివాదంపై స్పందించారు. మహిళల గౌరవాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల్ని విన్నప్పుడే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలని సూచించారు. ప్రత్యేకంగా ఓ వీడియో షూట్‌ చేసి సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘మహిళల గౌరవాన్ని సవాలు చేసే దారుణమైన ఘటన బిహార్‌లో జరగడం విచారకరం. నాకు తెలిసినంత వరకూ ఈ సవాలుకి ఒకే సమాధానం ఉంది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు విన్న మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి నిరసన వ్యక్తం చేయాలి. తమ గొంతుని బలంగా వినిపించాలి. నేను ఇండియాలో పుట్టి ఉంటే బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే దాన్ని. నితీశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది. బిహార్‌ మహిళలు సాధికారత సాధించేలా బీజేపీ చర్యలు చేపడుతుందని బలంగా నమ్ముతున్నాను. అలాంటి వ్యాఖ్యలకు ఇదే సరైన సమాధానం. బిహార్‌ ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలి. ఎన్నింటినో మార్చగలిగే శక్తి ఓటుకి ఉంది’’
మోదీపై ప్రశంసలు:
నితీశ్‌పై అసహనం వ్యక్తం చేసిన మేరీ..ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయన్న ఆమె ఆచితూచి ఓటు వేయాలని సూచించారు. మార్పు కోరుకునే వాళ్లకు ఇదే మంచి అవకాశమని స్పష్టం చేశారు. భారత్‌ అంటే తనకు ఎంతో అభిమానమని వెల్లడిరచారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని అన్నారు.’’చాలా మంది నన్ను అడుగుతుంటారు ఇండియాపై ఎందుకంత శ్రద్ధ అని. ఎందుకంటే ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. అమితంగా అభిమానిస్తాను. ప్రధాని నరేంద్ర మోదీపైనా నాకు గౌరవం ఉంది. భారత్‌కి ఆయనే బెస్ట్‌ లీడర్‌ అని కచ్చితంగా చెప్పగలను. అమెరికా,భారత్‌ మైత్రిని ముందుకు తీసుకెళ్లడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని మోదీ మహిళలకు అండగా నిలబడతారు’’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *