విజయవాడ:’చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు..దీంతో ‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ వారిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీల అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండిరచారు.’’రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలను ఎక్కడకక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం దుర్మార్గం. ఏపీలో ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోంది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. సీఎం జగన్ ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దుష్ట విధానాలను ఖండిరచాలి’’ అని కె రామకృష్ణ పిలుపునిచ్చారు.