భారత్ కెనడా మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతున్న వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు పంజాబ్‌లో ఉన్నటువంటి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో ముందడుగు వేసింది ఎన్‌ఐఏ. వివిధ దేశాల్లో నివసిస్తోన్నటువంటి మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదులకు చెందినటువంటి ఆస్తుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే వీళ్లకు చెందిన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సైతం వెల్లడిరచాయి. ఇప్పటికే.. వివిధ దేశాల్లో నివాసం ఉంటూ.. భారత్‌లో వేర్పాటువాదంపై ఖలిస్థాన్ సానుభూతిపరులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో ముఖ్యంగా బ్రిటన్, అమెరికా, కెనడా, దుబాయ్, పాకిస్థాన్ దేశాల్లో ఉంటున్నవారిని.. అలాగే ఇతర దేశాల్లో ఉంటున్న వారిని భారత్ ఇప్పటికే ఉగ్రవాదులుగా ప్రకటించేసింది. విదేశీ గడ్డపై ఉంటూ భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోన్న వీరి హవాలా కార్యకలాపాలను అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆస్తులపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద వీళ్లందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది జాతీయ దర్యాప్తు సంస్థ. ఇందుకోసం దాదాపు 20 మందికి చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైప ఖలిస్థాన్ వేర్పాటువాదంతోపాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి 43 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాను కూడా దర్యాప్తు సంస్థ ఈ మధ్యే విడుదల చేసింది.అంతేకాదు వీళ్లకు చెందిన ఆస్తుల వివరాలను కూడా తెలియజేయాలని ప్రజలకు సూచనలు చేశారు. అలాగే వీళ్ల ఫొటోలను కూడా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఉన్న ఖలిస్థాని సానుభూతిపరులు ఎక్కువగా కెనడా దేశంలోనే ఉంటున్నట్లు ఎన్‌ఐఏ అంచనా వేస్తోంది. ఇదిలా ఉండగా.. కెనడాలోని భారతీయులను ఇటీవల బెదిరించినటువంటి నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు పంజాబ్‌లో ఉన్నటువంటి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ జప్తు చేసేసింది. ఇదిలా ఉండగా.. అమృత్‌సర్ శివారులోని గురుపత్వంత్ పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లో అతనికి ఉన్న 5.7 ఎకరాల భూమిని.. అలాగే చండీగఢ్‌లో ఉన్నటువంటి నివాసాన్ని స్వాధీనం చేసుకుంది. కెనడాలో ఉంటున్న అతనిపై పంజాబ్, ఇతరప్రాంతాల్లో కలిపి మొత్తంగా 12 వరకు కేసులు ఉన్నాయి. మరోవైపు భారత్, కెనడాల మధ్య వివాదం ఎప్పుడు కొలిక్కివస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరో వైపు భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలోనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన తరవాత అమెరికా నిఘా వర్గాలు కెనడాకి కీలక సమాచారం అందించినట్టు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడిరచింది. ఇదే విషయాన్ని అమెరికా దౌత్యవేత్త కూడా ధ్రువీకరించారు. ఫైవ్ ఐస్ పార్టనర్స్ అందించిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే కెనడా భారత్‌పై ఆరోపణలు చేసినట్టు వెల్లడిరచారు. నిజ్జర్ హత్యకు, భారత్ ప్రభుత్వానికి కచ్చితంగా లింక్ ఉండే ఉంటుందని ఆ నివేదిక వెల్లడిరచినట్టు సమాచారం. అందుకే ట్రూడో ఆ వ్యాఖ్యలు చేశారు. కెనడాలోని న్యూస్ చానెల్ కూడా ఈ విషయాన్ని కన్‌ఫమ్ చేసింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలతో కూడిన ఫైవ్ ఐస్ పార్టనర్స్ కూటమి నిఘా సమాచారాన్ని అందిస్తుంటుంది. సెప్టెంబర్ 18వ తేదీన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యకి, భారత్‌కి లింక్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని భారత్ కొట్టి పారేసింది. 2020లోనే నిజ్జర్‌ని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే…కెనడాలోని అుపకి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలోనే అమెరికన్ డిప్లమాట్ డేవిడ్ కొహెన్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. నిజానికి చాలా రోజులుగా ఈ వాదన వినిపిస్తోంది. ఓ నిఘా వర్గం కెనడాకి సమాచారం అందించిందని, ఆ తరవాతే ట్రూడో ఇలా కామెంట్స్ చేశారన్న వార్తలు వచ్చాయి. కానీ…అధికారికంగా ఓ అమెరికా దౌత్యవేత్త ఈ విషయం వెల్లడిరచడం ఇదే తొలిసారి.అందించిన రిపోర్ట్ ఆధారంగానే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేశారు. భారత్ కెనడా మధ్య రోజురోజుకీ వివాదం ముదురుతోంది. భారత్ వీసా సేవల్ని నిలిపివేసింది. ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి’’` డేవిడ్ కొహెన్, అమెరికా దౌత్యవేత్తఅయితే…ఈ ఇంటిలిజెన్స్ సమాచారం రెండు విధాలుగా అందేలా ఏర్పాటు చేసుకున్నాయి 5 దేశాలు. ఈ ఫైవ్ ఐస్ పార్టనర్స్ లోని ఓ దేశం సీక్రెట్‌గా ఈ సమాచారాన్ని అందించినట్టుగా వెల్లడిరచింది. అంటే…ఆ నిఘా కూటమిలోని ఏదో ఓ దేశం కెనడాకి వివరాలు ఇచ్చింది. కానీ ఏ దేశం ఈ పని చేసిందన్నది మాత్రం రహస్యంగానే ఉంది. అటు అమెరికా దౌత్యవేత్త డేవిడ్ కోహెన్ ఇంతకు మించి ఏవిూ మాట్లాడలేదు. కొన్ని విషయాల్ని బహిరంగంగా చర్చించడం సరికాదని సమాధానాలు దాటవేశారు. ఇదంతా చూస్తుంటే..పక్కా ప్లాన్‌తో భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలకు తావిస్తోందంటున్నారు కొందరు విశ్లేషకులు.