విజయవాడ, నవంబర్‌ 7: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో తాము బలంగా ఉన్నామని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చింది. అందుకే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్‌ లు ఉన్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్‌ గా అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. మొన్నటి వరకూ తెలంగాణకు కూడా కాసాని జ్ఞానేశ్వర్‌ ఉన్నారు. అయితే పోటీ నుంచి పక్కకు తప్పుకోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి కారు పార్టీలో చేరిపోయారు. ఎన్నికలలో పోటీకి… తెలంగాణలో జరిగే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. అంటే ఈవీఎంలలో గుర్తు కూడా ఉండదు. 2018లోనే ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుడు జగన్‌ కు ఏపీ ముఖ్యం కావడంతో 2019 ఎన్నికల్లో దృష్టి పెట్టడానికి ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. దీంతో వైసీపీ తెలంగాణలో బోర్డు తిప్పే’సింది. ఇప్పుడు ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా లేకుండా పోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఆ ఓటు బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌ అయింది. . నేతలందరూ తమకు ఇష్టమైన పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. 2014, 2108 ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రచారం చేసిన చంద్రబాబు తాను జైలులోనే ఉండే పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. ఆయనకు కూడా 2024 ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యం. ఆ అంశంపైనే చర్చ ఏపీయే ముఖ్యం కావడంతో… ఇద్దరిదీ ఒకే ఆలోచన. ఏపీలో గెలవాలంటే ఇక్కడ అనవసరంగా వేలుపెట్టడం ఎందుకన్నది ఇద్దరు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో ఆ పార్టీలకు చిరునామా లేకుండా పోయింది. వైసీపీ అయితే పూర్తి స్థాయిలో ఏపీకే పరిమితమయింది. కానీ టీడీపీ మాత్రం ఇక్కడా, అక్కడా ఉంటూనే ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే టీడీపీలో ఉన్న తెలంగాణా నేతలందరూ ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *