రాయచోటి, నవంబర్ 6:జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలపై సానుకూలంగా స్పందిస్తూ నిర్ధేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం  కలెక్టరేట్లోని స్పందన హాలులో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ తో పాటు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖ, డిఆర్ఓ సత్యనారాయణ, ల్యాండ్ అండ్ సర్వే ఏడి జయరాజ్, డిఆర్డిఏ పిడి సత్యనారాయణ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ…. స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో ప్రయాసలకు కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రధాన కేంద్రాలకు వస్తుంటారని అధికారులు ప్రజల సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రతి అధికారి స్పందన ద్వారా స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా చదివి అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఎలోని దరఖాస్తులన్నింటినీ వేగంగా గడువులోగా పరిష్కరించి ఏ ఒక్క దరఖాస్తు కూడా బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు.

స్పందన కార్యక్రమంలో కొన్ని సమస్యలు:-

రాజంపేట మండలం రాంనగర్ కు చెందిన కే.లావణ్య తమకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.

రాయచోటి మండలం అబ్బవరం గ్రామానికి చెందిన ఎస్. ఆనందయ్య తమ గ్రామంలో మురుగునీటి కాలువ ఏర్పాటు చేయాలని స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.

మదనపల్లె పట్టణం, మారుతినగర్ కు చెందిన కే. రామసుబ్బయ్య తనకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.

గాలివీడు మండలం, గోరాన్ చెరువుకు చెందిన వై.వెంకటరమణ తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి శివయ్య, ఐసిడిఎస్ పిడి ధనలక్ష్మి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *