నర్మదా నది(Narmada River) పొంగి పొర్లడంతో గుజరాత్ లోని ముంపు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంటల్ని రైతులు నష్టపోయారు. స్పందించిన గుజరాత్(Gujarath) ప్రభుత్వం నష్టపోయిన(Crop Loss) రైతులకు ప్రత్యేక సహాయక ప్యాకేజీ(Compensation)ని ప్రకటించింది. పంటల రకం, సాగు విధానాన్ని బట్టి ఆర్థిక సాయం మారుతుందని అధికారులు చెబుతున్నారు. అర్హులైన రైతులు అక్టోబర్ 31 లోపు ‘డిజిటల్ గుజరాత్ పోర్టల్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నర్మదా నది పొంగిన ఘటనలో భరూచ్, నర్మదా, వడోదర జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. మూడు జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఆధారంగా ప్రత్యేక సహాయ ప్యాకేజీ అందించనున్నారు