ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Former CM Nara Chandrababu Naidu)ను రాజకీయ కుట్రతోనే జైలుకు పంపారని, ముఖ్యమంత్రి జగన్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం సరికాదని టీడీపీ నాయకుడు సూరిబాబు అభిప్రాయపడ్డారు. శనివారం విలేకరులతో మాట్లాడిన సూరిబాబు 14 సంవత్సరాలుగా మచ్చలేని నాయకుడుగా చంద్రబాబు ఏపీని పాలించారన్నారు. ప్రజలకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా రాష్ట్రా న్ని పరిపాలించారన్నారు. ఇప్పుడున్న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రలో రాబోయే కాలంలో ఈ సైకోముఉఖ్యమంత్రికు ఓట్ల వల్ల ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమ నాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, త్వరలోనే కోర్టు ద్వారా విడుదల అవుతారన్నారు. వైఎస్సార్‌ ప్రభుత్వానికి బుద్దిచెప్పే కాలం త్వరలో వస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే తమ వంతుగా తమ నాయకుడు మద్దతుగాను సిరుగప్ప, బళ్లారి, కంప్లి ఇతర పట్టణాలలో ధర్నాలు, నిరసనలు కూడా జరిపామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా నిరసనలు చేపడ్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *