తిరుపతి: ఆటో కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించి ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వెయ్యాలని తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేష్ డిమాండ్ చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద బుధవారం ఏఐటీయూసీ అనుబంధ సంస్థ తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఫీుభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేష్ విూడియాతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల పెండిరగ్ లో ఉన్న పోలీస్ ఈ ` చలానాలను రద్దు చేయాలని,, ప్రైవేట్ ఫైనాన్సర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.భారీగా పెనాల్టీలను పెంచే జీవో నెంబర్ 21, 31 లను రద్దు చేయాలని కోరారు. తక్షణమే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పిఎఫ్,ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ డీజిల్ లను జిఎస్టి పరిధిలోకి తెస్తూ భారీగా పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లను 50 శాతం తగ్గించాలని కోరారు. లైసెన్స్ కలిగి అర్హత ఉన్న ప్రతి డ్రైవర్ కు వాహాన మిత్ర పథకాన్ని అందించాలని, జాతీయ బ్యాంకుల ద్వారా కొత్త ఆటో కొనుగోలుకు లోన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లన్నీ త్వరగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.శివ,అధ్యక్షులు ఎస్ సురేష్, నగర అధ్యక్షులు కే వై రాజా, టాక్సీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్ వి రమేష్ ,తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు సురేష్ ,కృష్ణ ,శంకర బాలు ,ప్రవిూల, పార్వతి, రూప ,రాజా తదితరులు పాల్గొన్నారు.