నెల్లూరు: నూర్ బాషా దూదేకుల సమస్యల సాధనకై ఈనెల 29న చలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహించిన జరుగుతుందని నూర్ బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్. సుభాన్ బాషా పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలలో నూర్ బాషా దూదేకులకు ప్రాధాన్యత కల్పిస్తూ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నూర్ భాషా దూదేకుల సంఫీుయుల జీవన స్థితిగతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలానే ఉందన్నారు. రాష్ట్రంలోని జాతీయ పార్టీలు నూర్ బాషా దూదేకుల ఓటు బ్యాంకును వినియోగించుకుంటున్నారే తప్ప, వారి అభివృద్ధి సంక్షేమానికి ఏ విధంగానూ సహకారాలు అందించడం లేదని తమ ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్ర బడి పిలుపుమేరకు గుంటూరు నగరంలోని ఆంధ్ర ముస్లిం కాలేజీ ఆవరణలో ఈనెల 29న మధ్యాహ్న 3 గంటలకు నిర్వహించనున్న నూర్ భాషా దూదేకుల సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దూదేకుల నూర్ బాషా సంఘం ప్రతినిధులు సాయిబాబు, అల్తాఫ్ ,హజరత్ అలీ, షరీఫ్, నిర్మల్ ,జహీర్ తదితరులు పాల్గొన్నారు.