శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్న – రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చమర్తి జగన్
రాజంపేట:అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గమ్, రాజంపేట పట్టణం నందు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం,ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మంగళవారం నాడు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ రాజు గారిని సన్మానించి అభినందించడం జరిగినది. ఆలయంలోపల అక్కడ ఉన్న కళాకారులతో పరిచయం చేసుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల ప్రకాష్. గూడూరు హరి. పద్మశ్రీ మనీ. కృష్ణ. మరియు ఆయన వెంట టిడిపి అభిమానులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.