నెల్లూరు, అక్టోబరు 14: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు. అయితే గడిచిన ఏళ్లలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలు అన్ని వర్గాలకు పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. నా బీసీ, నా ఎస్సే,నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ పేదల ప్రభుత్వం అంటూ చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు ప్రభుత్వం పై సానుకూలంగా ఉన్నారని సీఎం జగన్‌ చెబుతున్నారు. మేనిఫెస్టో లో 99 శాతం హావిూలు నెరవేర్చామని కూడా సీఎం జగన్‌ చెబుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు మిగిలిన ఒకటి, రెండు కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే జనవరి నుంచి సామాజిక పెన్షనలను 3 వేల రూపాయలకు పెంచి ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎ జగన్‌. ఇక మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. సివిల్స్‌ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తీసుకువచ్చారు. జగనన్న సివిల్స్‌ ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతూ విధివిధానాలతో జీవో ఎంఎస్‌ 58 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్ధులకు ఈ పథకం వర్తించేలా రూపొందించారు. సివిల్స్‌ పరీక్షల్లో ప్రిలిమ్స్‌ లో అర్హత సాధించిన అభ్యర్దులకు వారు మెయిన్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం జగన్‌ ప్రకటిచారు. ఇక మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు ఇంటర్వ్యూలకు అవసరమైన కోచింగ్‌, ఇతర అవసరాల కోసం 50 వేల ఆర్థిక సాయం అందించనుంది జగన్‌ ప్రభుత్వం. అయితే పథకానికి ఎలాంటి అర్హతలుండాలనే దానిపై జీవోలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన ఈబీసీ వర్గాలకు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *