బద్వేల్ లో విచ్చలవిడిగా ఆహార పదార్థాల కల్తీ
జంతు కళేబరాలతో నూనె
పత్తాలేని ఫుడ్ ఇన్స్పెక్టర్
ఆహార పదార్థాలు తనిఖీ చేసే అధికారులు ఎక్కడ ?
బద్వేల్ లో చాలా దుకాణాల్లో కల్తీ ఆహార పదార్థాలు
ప్రజల ఆరోగ్యంతో కొందరు దుకాణ దారుల ఆట
బావి తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం !
బద్వేలు:బద్వేల్ లో విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలు విక్రయాలు జరుగుతున్నాయి చాలా కాలంగా ఇదే పద్ధతి కొందరు వ్యాపారులు యదేచ్చగా కొనసాగిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయించడంలో కొందరు పెద్ద వ్యాపారులు కూడా ఉండడం విశేషం. వీరు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కల్తీ ఆహార పదార్థాల వల్ల భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్ధంగా మారింది. బద్వేల్ పట్టణంలో మెజార్టీ దుకాణాల్లో కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఏమాత్రం నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయించడం వల్ల వాటిని కొనుగోలు చేసిన వినియోగదారులు అటు ఆరోగ్యం ఇటు డబ్బు భారీగా నష్టపోతున్నారు. ఇటీవల బద్వేల్ పట్టణానికి చెందిన ఐదు మంది కల్తీ ఆహార పదార్థాలు కొనుగోలు చేసి వాటిని తిన్న తర్వాత అనారోగ్యం పాలై పక్క జిల్లాలోని ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొంది వేలకు వేల రూపాయలు నష్టపోయారు. ఇదంతా కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్లే ఆరోగ్యం దెబ్బతిందని వారికి చికిత్స అందించిన డాక్టర్లు నిర్ధారించారు
బద్వేల్ లో కల్తీ ఆరపదార్థాలు అమ్మకాలు జరుగుతున్న విషయం సంబంధిత అధికారులకు బాగా తెలుసు అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కల్తీ ఆహార పదార్థాలు అమ్మకాలు జరక్కుండా చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. కనీసం దుకాణాలు తనిఖీ చేసిన పాపాన పోలేదు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారి నుండి సంబంధిత అధికారులకు సిబ్బందికి నెలవారి ముడుపులు అందుతున్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు తగ్గట్టుగానే వారి వ్యవహారం ఉంది ఆహార పదార్థాలపై తయారీ తేదీ ఎండాకాలంలో లోపల వినియోగించుకోవాలి అనే కంపెనీ ముద్రలు ఉంటాయి. కానీ చాలా ఆరపదార్థాల ప్యాకెట్లపై ఇలాంటి ముద్రలు లేకపోవడం విశేషం. వాటిని కొందరు వ్యాపారులు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. సుగంధ ద్రవ్యాలు నెయ్యి
డాల్డా నూనె పసుపు కారం చికెన్ మసాలా తదితర ఆహార పదార్థాలలో భారీ కల్తీ జరుగుతోంది వీటిని హోల్సేల్గా కొనుగోలు చేసి పాల్తిన్ ప్యాకెట్లలో చుట్టి వినియోగ దారులకు
అమ్ముతున్నారు. పాలలో సైతం డిటర్జెంట్ పౌడర్ కలిపి కల్తీ చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు ముఖ్యంగా నూనె వస్తువుల్లో జంతు చర్మాలు ఎముకలు బాగా శుద్ధిచేసి వాటిని నూనె రూపంలోకి వచ్చిన తర్వాత ప్యాక్ చేసి వినియోగదారులకు అంట కడుతున్నారు. అందమైన ప్యాకింగ్ ఉండడంతో కల్తీ ఆహార పదార్థాలు వినియోగదారులు గుర్తించలేక పోతున్నారు. తేనెలో చక్కర బెల్లం పాకం కలుపుతున్నారు ఐస్ క్రీమ్ లో వాషింగ్ పౌడర్
కలుపుతున్నారు. ఉప్పులో శుద్ధ పొడి పండ్లపై మైనం ఉపయోగిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాల అమ్మకాలపై విచారణకు కొలతలు తూనికల అధికారులు విజిలెన్స్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. కేవలం ముడుపులకే పరిమితం అయ్యారు ఎండబెట్టిన బొప్పాయి గింజలను మిరియాలుగా మారుస్తున్నారు. ఇందుకోసం బ్యాక్ ఆక్సైడ్ ను ఉపయోగిస్తున్నారు పసుపులో తౌడు టీ పొడిలో రంపంపు పొట్టు కారంపొడిలో
కాల్చిన ఇటుకల పొడి గసగసాలలో గోధుమ రవ్వ చక్కెరలో బియ్యం రవ్వ కలుపుతున్నారు. ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కల్తీ ఆహార పదార్థాలు వినియోగదారులకు అంట కడుతున్నారు. ఆహార పదార్థాలు తయారు చేసేందుకు వీరికి ఇటువంటి లైసెన్సులు లేవు అయినప్పటికీ కల్తీ ఆహార పదార్థాలు తయారుచేసి వాటిని వ్యాపారులకు ఇస్తున్నారు. వీటినే కొందరు వ్యాపారులు ప్రజలకు అంట కడుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాలు చౌకగా కొనుగోలు చేసి ప్రజలకు ఎక్కువ మొత్తంలో ఎకరాలు చేస్తున్నారు కల్తీ ఆహార పదార్థాలు అరికట్టే వారు లేకుండా పోయారు.