చంద్రబాబు ప్రాణాలకు ఏదైనా హాని తల పెడితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత
రాజంపేట టిడిపి సీనియర్ నేత ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు
రాజంపేట: రాజమండ్రి జైల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు ఆరోగ్య విషయంలో ఏమి జరిగినా రాష్ట్రప్రభుతమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ సీనియర్ నేత సి.జగన్ రాజు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 73 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలు తలెత్తినా మెరుగైన వైద్యం అందించలేదని ఆరోపించారు. ఆరోగ్య సమస్యలతో ఐదు కిలోల బరువు కూడా తగ్గారని ఆవేదన అర్థం చేశారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య విషయంలో అధికారులు ఏదో దాస్తున్నారని పేర్కొన్నారు. వయసు పరంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజా నాయకుడి పట్ల జగన్ సర్కార్ అమానుషంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యం సంబంధించి జైలు అధికారులు ప్రకటన చేయడం ఏమిటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రి కి ఇచ్చే గౌరవం ఇదే నా అని మండిపడ్డారు.