శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో రోబోటిక్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ లాంగ్వేజ్ అంశంపై వర్క్ షాప్ నిర్వహణ
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నాడు
రోబోటిక్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ అనే అంశంపై ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించారు . ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ . డాక్టర్ .కిరణ్ కుమార్ రిసోర్స్ పర్సన్ గా హాజరయ్యారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనిషికి ప్రత్యామ్నాయంగా రోబోటిక్స్ టెక్నాలజీ వివిధ రంగాల్లో సేవలను అందిస్తున్నదని ,కావున వివిధ రంగాల్లో భవిష్యత్తులో రోబోటిక్స్ పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు . ఈ వర్క్ షాప్ నందు ప్రోటో టైప్ రోబోటిక్స్ కు, పైతాన్ లాంగ్వేజ్ ద్వారా అనుసంధానించడాన్ని విద్యార్థిని విద్యార్థులకు కూలంకుషంగా వివరించారు. ఇలాంటి వర్క్ షాప్ లో పాల్గొనడం ద్వారా విద్యార్థిని విద్యార్థులు వివిధ సంస్థలు నిర్వహించు ఇంటర్నె షిప్ ప్రోగ్రాములకు అర్హత సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
శ్రీ సాయి విద్యాసంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్ . సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రోబోటిక్స్ టెక్నాలజీ పారిశ్రామిక ,బ్యాంకింగ్, వైద్య,ఆరోగ్య, ఆటోమోటివ్, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన సేవలను అందిస్తున్నదని తెలియజేశారు . కావున ఈ రంగంలో అధిక వేతనంతో కూడిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు సూచించారు . రోబోటిక్ టెక్నాలజీ లాంటి కొత్త కోర్సులపై విద్యార్థినీ విద్యార్థులు ఆసక్తి కనబరిచి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.బాలాజీ వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.