సమిష్టి కృషితో సంబేపల్లె శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి దసరా ఉత్సవాలును జయప్రదం చేద్దామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రాయచోటి పట్టణానికి చెందిన షిర్దీ సాయి మహిళా డిగ్రీ అండ్ పిజి కళాశాల డైరెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి,మరియు వైవి నాగిరెడ్డి విద్యాసంస్థల అధినేత జయప్రకాష్ రెడ్డిల సహకారంతో ముద్రించిన పోస్టర్లను ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 18 నుంచి 23 వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్దలుతో, పెద్దఎత్తున దసరా ఉత్సవాలును నిర్వహిస్తుండడం అభినంద నీయమన్నారు. అమ్మవారిని రోజుకొక అలంకారంలో తీర్చిదిద్దడం, రోజూ హోమాలు నిర్వహించేలా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. భక్తులు, దాతల సహకారంతో ఈ ఆలయంలో తరచూ పెద్దఎత్తున కార్యక్రమాలును నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. దేవరరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయ ఖ్యాతి రోజు రోజుకూ విస్తరిస్తుండడం హర్షణీయమన్నారు. ఆలయ అభివృద్దికి తమ వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తామన్నారు.
డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, ఆలయ నిర్మాణ కర్త మునగా మురళీ స్వామి, మండల నాయకులు వివి ప్రతాప్ రెడ్డి,సర్పంచ్ అంచల రామచంద్ర, ఎంపిటిసి శ్రీధర్ రెడ్డి,చింతల జనార్దన్ రెడ్డి, ఆర్ఎంపీ వీరశంకర్, డీలర్ సుధీర్ రాజు, చిన్నమండెం కూటాల నారాయణప్ప, యూత్ లీడర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.