రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం చాలా దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. కానీ భారత్‌ మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లోనూ మెరుగ్గా రాణించింది. పలు దేశాలకు అండగా నిలుస్తూ.. ఆర్ధికంగా స్థిరంగా కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్‌.. స్థిరంగా ఉండేందుకు ప్రధాన కారణం దౌత్యపరమైన అవగాహన.యూరోపియన్‌ దేశాలకు రష్యా చమురు సరఫరాను నిలిపివేసిన తర్వాత.. ఇతర వనరులను వెతికే పనిలో పడ్డారు. దీని కారణంగా ప్రపంచ మార్కెట్‌లో చమురు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అలాగే చమురు ధరలు కూడా అమాంతం పెరిగాయి. దీని ప్రభావం భారత్‌పై కూడా ప్రత్యక్షంగా పడిరది. ద్రవ్యోల్బణం, దిగుమతుల సంక్షోభం ఏర్పడిరది. దీనికి కారణంగా భారత్‌ తన చమురు సరఫరాలో 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దౌత్యం ద్వారా ఈ విపత్కర పరిస్థితుల్లో నిలదొక్కుకుంది. పాశ్చాత్య దేశాలతో తమ బంధాన్ని సమతుల్యం చేస్తూ భారతదేశం చమురును దిగుమతి చేయడం ప్రారంభించింది. ఫలితంగా ప్రపంచ సంక్షోభం ఉన్నప్పటికీ దేశ ప్రభుత్వం స్థిరంగా ఉంది. రష్యాపై వివిధ దేశాల నుంచి అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ, భారతదేశం చౌకగా చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇది భారతదేశ ఆర్ధిక కోణాన్ని మరింతగా పెంచింది. దీని వల్ల దేశీయ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.మరోవైపు రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం చమురు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపింది. దీని కారణంగా చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ పరిస్థితి భారతదేశానికి పెద్ద సవాలుగా మారింది. కానీ రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితిని అదుపులో ఉంచింది. దీని వల్లే దేశంలో చమురు ధరలు కంట్రోల్‌లో ఉన్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఎదుగుదలకు బ్రెక్సిట్‌, కరోనావైరస్‌, దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య కలహాలు సవాళ్లుగా కనిపిస్తున్నప్పటికీ, రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా వృద్ధి రేటుని 26 శాతంగా అంచనా వేసినప్పటికీ, 2050 నాటికి ప్రపంచ మార్కెట్‌ ప్రస్తుతం ఉన్న స్థాయి కన్నా రెట్టింపు కావచ్చు.ఈ ఎదుగుదలతో పాటు ప్రపంచంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. భవిష్యత్‌ ఎలా ఉంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, అత్యధిక మంది ఆర్ధిక వేత్తలు మాత్రం నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లే రేపటి ఆర్ధిక సూపర్‌ పవర్లనే విషయాన్ని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు.ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన ‘ది వరల్డ్‌ ఇన్‌ 2050’ నివేదిక ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న జాబితాలో ఉన్న 7 దేశాలలో 6 దేశాలు ఇంకో 30 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేరుతాయని పేర్కొంది.
అమెరికా (రెండవ స్థానం నుంచి 3వ స్థానానికి), జపాన్‌ (4 నుంచి 8వ స్థానానికి) జర్మనీ (5 నుంచి 9 వ స్థానానికి) పడిపోతాయని వ్యాఖ్యానించింది. వియత్నాం, ఫిలిప్పీన్స్‌, నైజీరియా లాంటి ఆర్ధిక వ్యవస్థలు కూడా మరో 30 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందుతాయని ఈ నివేదిక చెప్పింది.అభివృద్ధి పధంలో ఉన్న దేశాలలో గణనీయంగా చోటు చేసుకుంటున్న మార్పులని అక్కడి ప్రజలు స్వీకరిస్తున్న విధానం, , ఆ దేశాల్లో నివసించడం వలన ఉండే లాభాలు, ఎదురవుతున్న సవాళ్ళను అర్ధం చేసుకునేందుకు బీబీసీ ఐదు దేశాల పౌరులతో మాట్లాడిరది.పర్చేసింగ్‌ పవర్‌ పారిటీ (పిపిపి) అనే అంతర్జాతీయ సంస్థ అంచనా వేసిన స్థూల జాతీయ ఉత్పత్తి ప్రకారం, చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్ధిక వ్యవస్థగా పరిణమించింది. ఇది ఇప్పటికే ఆర్ధికంగా ఎదిగినప్పటికీ, ఈ ఎదుగుదల కేవలం శిఖరానికి ఒక అంచులాంటిదేనని, భవిష్యత్లో ఇది మరింత అభివృద్ధి చెందుతుందని ఆర్ధిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.చైనాలో నివసిస్తున్న వారి కళ్ళ ముందే అతి పెద్ద ఆర్ధిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘‘గత కొన్నేళ్లుగా నేను నివసిస్తున్న షిజో ఇండస్ట్రియల్‌ పార్క్‌ షాపింగ్‌ మాల్స్‌, పార్కులు , రెస్టారంట్లు , ట్రాఫిక్‌ తో నిండిపోయింది. ఇక్కడికి నేను 15 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ అంతా వ్యవసాయ భూమి ఉండేది ‘‘, అని వన్‌ మినిట్‌ చైనీస్‌ బుక్స్‌ అనే పుస్తకం రాసిన రోవాన్‌ కోల్‌ చెప్పారు. ‘‘ఇది చైనా లో ప్రతి రోజు జరుగుతున్న కధే. దేశం అంతా శరవేగంగా మారిపోతోంది’’.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవ స్థానంలో ఉన్న భారత దేశం మరో మూడు దశాబ్దాల్లో ఏటా సగటున 5 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదలతో గణనీయంగా ఆర్ధిక అభివృద్ధి సాధించనుందని నివేదిక పేర్కొంది.2050 కల్లా భారతదేశం, అమెరికాను అధిగమించి ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో 15 శాతం వాటాతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో రెండవ స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది. ఈ అభివృద్ధి ఫలాలు ఇప్పటికే ప్రజలకు చేరడం ప్రారంభమైంది.‘‘20వ శతాబ్దం చివర నుంచి 21వ శతాబ్దం ఆరంభం వరకు నా కళ్ళ ముందు దేశ స్వరూపం మారిపోవడం చూస్తున్నాను’’ అని టాక్‌ ట్రావెల్‌ యాప్‌ నిర్వాహకుడు సౌరభ్‌ జిందాల్‌ అన్నారు.ఆర్ధిక రంగంలో చోటు చేసుకున్న మార్పులు ప్రజల జీవన విధానంలో, నగర జీవితంలో, దేశ పౌరుల నడవడిక, అలవాట్లలో అనేక మార్పులు తెచ్చాయని ఆయన వివరించారు.విమాన ప్రయాణాలు చాలా మందికి అందుబాటులోకి రావడమే కాకుండా, చాలామంది ఖరీదైన , విలాసవంతమైన భవనాలలో నివసిస్తున్నారని అన్నారు.అలాగే పలు రాయితీల ద్వారా వినియోగదారులపై ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించింది మోదీ సర్కార్‌. ఒకవైపు రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ ఏకాభిప్రాయం.. భారతదేశ ఖ్యాతిని ఆర్ధిక సంక్షోభం నుంచి కాపాడటంలో దోహదపడిరది. చమురు సరఫరా, ధరల నియంత్రణను అదుపులో ఉంచడం, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో ప్రభుత్వం అద్భుత విజయం సాధించిందనే చెప్పాలి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *