వియవాడ, అక్టోబరు 6: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సింగిల్‌ గా పోటీ చేసి 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్‌ కూడా వై నాట్‌ 175 నినాదంతోనే ముందుకెళ్తున్నారు. అంతేకాదు ప్రజల్లోకి వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు విూ కుటుంబానికి మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటేయండని ధీమాగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని చెప్పుకొస్తున్నారు. దీంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం రూపకల్పన చేసారు. అక్టోబర్‌ 11వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్‌ ఎందుకు రావాలనే క్యాంపెయిన్‌ నిర్వహించున్నారు. దీనికి సంబంధించి నెల రోజుల పాటు క్యాంపెయిన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయం వంటి అన్ని అంశాలను ప్రజలకు వివరించేలా ఈ క్యాంపెయిన్‌ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ వార్డు స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ అందరూ పాల్గొననున్నారు. అయితే కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ఏయే అంశాలపై ప్రజలకు వివరించాలి అనే దానిపై ముందుగానే రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌ నిర్వహించనుంది వైఎస్సార్‌ సీపీ. ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లిన కేడర్‌.. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ క్యాంపెయిన్‌ ద్వారా ప్రభుత్వం చేసిన సంక్షేమం, ఒక్కో కుటుంబానికి అందిన లబ్ది వివరాలు అందించడంతో పాటు గత ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందాయనే దానిపై కూడా ప్రజలకు వివరించనున్నారు. ఇంత సంక్షేమం, అభివృద్ది అందించారు కాబట్టి మరోసారి జగన్‌ ను సీఎం చేయండని ప్రజలకు వివరించనున్నారు. తమ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయండని కోరనున్నారు. ఇలా నెలరోజుల పాటు ఈ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నారు వైసీపీ కేడర్‌.పార్టీ నాయకులను, కేడర్‌ మొత్తాన్ని సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రజల మధ్యే ఉండేలా కార్యక్రమాలు రూపకల్పన చేసారు.ే అక్టోబర్‌ 11 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం ప్రారంభించేందుకు వైఎస్సార్‌ సీపీ ఏర్పాట్లు చేస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సీఎం జగన్‌ కూడా పార్టీపై ఫోకస్‌ బాగా పెంచారు. వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకం అని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇంచార్జిలకు దిశా నిర్దేశం చేశారు. పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలని సూచించారు. అంతేకాదు త్వరలో సీఎం జగన్‌ కూడా జిల్లాల పర్యటన ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం, పార్టీ అంతా ప్రజల్లోనే ఉండేలా ముందుకెళ్తున్నారు. కిందిస్థాయి కేడర్‌ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేలా కేడర్‌ ను అన్ని రకాలుగా సమాయత్తం చేస్తూ వైసీపీ అధినేత జగన్‌ ముందుకెళ్తున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *