తిరువనంతపురం, సెప్టెంబర్‌ 9:మలయాళ చిత్రపరిశ్రమలో నటీమణులపై వేధింపులకు సంబంధించి జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక దేశ్యాప్తంగా అలజడి రేగింది. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ముందస్తు చర్యలు చేపట్టింది. కోలీవుడ్‌లో మహిళల రక్షణకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేసింది సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నడిగర్‌ సంఘం. ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించింది.నడిగర్‌ సంఘం 68వ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఆదివారం చెన్నైలోని కామరాజర్‌ అరంగంలో జరిగింది. ఈ సమావేశంలో యూనియన్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు. జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌, కోశాధికారి నాసర్‌, కార్తీతోపాటు పలువురు పాల్గొన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్‌ తెలిపారు. రోహిణి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. రోహిణీతోపాటు మరో నటి సుహాసిని ఈ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. నడిగర్‌ సంఘంలో సభ్యత్వం లేని వారైనా సరే… ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. సీనియర్‌ యాక్టర్‌, కొత్త నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌.. ఇలా ఎవరిపై ఫిర్యాదు వచ్చినా… తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల సమస్యను చాలా సీరియస్‌గా తీసుకున్నామని అన్నారు నడిగర్‌ సంఘం ప్రెసిడెంట్‌, నటుడు నాజర్‌. అందుకే కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీలో న్యాయవాదులు కూడా ఉంటారన్నారు. ఇది తమ తొలి అడుగు అని చెప్పారు నాజర్‌. ఇండస్ట్రీలో పనిచేసే మహిళలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తమకు ఎదురైన వేధింపుల గురించి నటీమణులు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ అంశంపై నటి రోహిణి కీలక వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల గురించి విూడియా ముందు మాట్లాడొద్దని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా… విూడియా ముందు మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయాజనం ఉండదన్నారు. ఇక.. 2019 నుంచి నడిగర్‌ సంఘంలో అంతర్గత కమిటీ పని చేస్తోంది కానీ… అంత చురుకుగా లేదు. దీంతో… రోహిణి అధ్యక్షత కమిటీని నియమించారు. మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావాలని రోహిణి కోరారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరస్తులపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తారు. బాధితులకు న్యాయ సహాయం అందేలా చూస్తామని నాడిగర్‌ సంఘం తెలిపింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, వేధింపులను తెలుపుతూ… జస్టిస్‌ హే కమిటీ… ఒక నివేదికను తయారు చేసి కేరళప్రభుత్వానికి అందించింది. పనితీరు, రెమ్యునరేషన్‌, సాంకేతి రంగంలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. క్యాస్టింగ్‌ కౌచ్‌ మొదలు.. వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రిపోర్టులో పేర్పొంది. ఈ రిపోర్ట్‌ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో… నటీమణులు బయటకు వచ్చి… తమకు ఎదురైన చేదు అనుభవాలు, వేధింపులను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో… ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌, నటుడు జయసూర్య, మణియన్‌ పిళ్లరాజుపై కేసులు కూడా కేసులు నమోదయ్యాయి. మాలీవుడ్‌ తరహాలోనే… ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించింది నడిగర్‌ సంఘం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *