హైదరాబాద్‌, అక్టోబరు 5: తెలంగాణలో ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌. 2022`23లో 22 లక్షల ఓట్లు తొలగించామన్న ఆయన…డెత్‌ సర్టిఫికెట్లు ఉన్న వాటినే ఓటర్‌ జాబితా నుంచి తొలగించామన్నారు. అప్లికేషన్‌ వచ్చిన తర్వాతే ఓటర్లను జాబితా నుంచి పేర్లు తొలగించామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులు ప్రచార ఖర్చును పెంచాలని పార్టీలు కోరినట్లు రాజీవ్‌ కుమార్‌ వెల్లడిరచారు. ట్రాన్స్‌ జెండర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 మంది ఉన్నారని తెలిపారు. తెలంగాణలో 3.17 మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించింది సీఈసీ. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మూడు రోజుల పర్యనటన అనంతరం హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణాలో విూడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈసీ. రాబోయే ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొనాలని అఇఅ రాజీవ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలతో మేము ముందుగా సమావేశమయినట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయం పరిమితి పెంచాలని పార్టీలు కోరినట్లు వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలతో కూడా అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం 3 రోజుల పాటు పరిశీలించిన విషయం తెలిసిందే.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *