హైదరాబాద్‌: రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్‌ చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హీత్రూ విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, భారత జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం నాడు పబ్లిక్‌ పాలసీ పై ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్‌ ఇండియా మహిళా రిజర్వేషన్లు ` ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించనున్న సమావేశంలో కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో యూకే రాజకీయ నాయకులు, ఎన్నారైలు, పౌర సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే లండన్‌ లోని అంబేద్కర్‌ మ్యూజియాన్ని కల్వకుంట్ల కవిత సందర్శిస్తారు. శనివారం ఎన్‌ఐఎస్‌ఏయు ఆధ్వర్యంలో జరగబోయే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో సంభాషిస్తారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *