న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 3: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కవిత బెయిల్‌ విూద చేసిన వ్యాఖ్యలపైన అత్యున్నత ధర్మాసనం మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసుపై జగదీశ్వర్‌ రెడ్డి పిటీషన్‌ పై విచారణ ఈ క్రమంలో 2015 నాటి ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు ఇంతకుముందే చేసిన సుప్రీం ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణకు సీఎం గా రేవంత్‌ రెడ్డి ఉన్నారని, ఈ కేసును మధ్యప్రదేశ్‌ కు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తరఫున పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై అత్యున్నత ధర్మసనం న్యాయవ్యవస్థపై ఇటువంటి అనుమానాలు మంచిది కాదు అని తేల్చింది. మళ్ళీ నేడు కేసు విచారణ ఏదో జరిగిపోతుందని ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థ పట్ల గౌరవం అనిపించుకోదని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. కావాలంటే సీఎం రేవంత్‌ కేస్‌ కోసం స్పెషల్‌ గా ఇండిపెండెంట్‌ ప్రాసిక్యూటర్ని కూడా నియమించేందుకు సిద్ధమని వెల్లడిరచింది. దీనిపైన ఇరు వర్గాలక మధ్య 30 వతారీఖున ఏకాభిప్రాయం రాకపోవడంతో జస్టిస్‌ గవాయి తో కూడిన ధర్మాసనం కేసును ఈరోజుకు వాయిదా వేసింది. రేవంత్‌ రెడ్డికి సుప్రీం నోటీసులు అయితే నేడు సుప్రీంకోర్టులో మరోమారు ఓటుకు నోటు అంశంతో పాటు సీఎం రేవంత్‌ సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి.. కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌ సోషల్‌ విూడియా పోస్టుల పైన పూర్తి వివరణ ఇవ్వాలని కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరణకు రెండు వారాల గడువు ఆ నోటీసులలో సోషల్‌ విూడియా పోస్టులపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పైన సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. కవిత బెయిల్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన సోషల్‌ విూడియా పోస్టులను సీరియస్‌ గా తీసుకున్న సుప్రీం ధర్మాసనం వివరణ ఇవ్వాలని రేవంత్‌ రెడ్డిని ఆదేశించింది. ఆయనకు రెండు వారాల గడువు ఇచ్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *