విజయవాడ, సెప్టెంబర్ 3:సజ్జన్ జిందాల్ గతంలో పదే పదే జగన్ ను కలుస్తూంటే స్టీల్ ఫ్యాక్టరీ కోసం అనుకున్నామని కానీ వెనుక హీరోయిన్ కాదంబరి జెత్వానీని టార్గెట్ చేసి వేధించే కుట్ర ఉందని తెలిసిన తర్వాత ఆశ్చర్య పోవాల్సి వచ్చిందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా కలెక్టర్ ను ఆమె కలిశారు. స్టీల్ ప్లాంట్ పురోగతిపై మాట్లాడారు . ఆ తర్వాత విూడియా తో మాట్లాడిన సందర్భంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. జిందాల్ కంపెనీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు కానీ.. పదే పదే తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జన్ జిందాల్ కలుస్తుంటే కడప స్టీల్ వేగవంతం చేస్తున్నారు అనుకున్నామన్నారు. ?కాని ఒక మహిళా కాదంబరి విషయం బయట పడే సరికి ఇందుకా.. అని ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పదే పదే జగన్ ని కలుస్తుంటే కడప స్టీల్ విూద చిత్తశుద్ధి అనుకున్నామని.. కానీ ఒక మహిళను కట్టడి చేసేందుకు స్కీమ్ లు వేశారని అర్థం అయిందన్నారు. ఇది మామూలు మాస్టర్ ప్లాన్ కాదని షర్మిల మండిపడ్డారు. ?ఆడదాన్ని ఒక్క దాన్ని చేసి తొక్కాలని చూశారని విమర్శించారు. ?జె అండ్ జె ఇద్దరు కలిసి బుర్రకు పదనును పెట్టి.. ?జె స్వేర్ కలిసి కార్యాచరణ చేశారన్నారు. ?విూ బుర్రలు కడప స్టీల్ విూద పెట్టి ఉంటే ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేదన్నారు. ?సజ్జన్ జిందాల్ గతంలోనే జగన్ గురించి చెప్పారని.. ?ఇద్దరు మంచి దోస్త్ లు అని చెప్పాడని గుర్తు చేశారు. ? ?రాష్ట్రానికి జిందాల్ ఏమి చేశాడు అని వేల ఎకరాలు భూములు కట్ట బెట్టారో చెప్పాలని జగన్‌ని ప్రశ్నించారు. ?జిందాల్ కి 3500 ఎకరాలు అప్పగిస్తే ఎందుకు పనులు ప్రారంభించలేదని ప్రస్నించారు. జెత్వాని ఒక డాక్టర్. ఆమె ఒక నటి .. ఒక గొప్పకుటుంబం నుంచి వచ్చారన్నారు. ?ఆమె ఒక కేసు పెడితే .. ఆమెను తొక్కాలని చూశారని.. ?నిజంగా కాదంబరి మోసం చేయాలని చూస్తే జిందాల్ ఒక 50 లేదా 100 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోనే వాడు కదా అని ప్రశ్నించారు. ?ఆమె న్యాయం కావాలని నిలబడిరదన్నారు. ?ఆమెను కట్టడి చేయడం కోసం ఐపీఎస్ అధికారులను ఉపయోగించారని.. ?ఆమె విూద ఇది దారుణ చర్య అని మండిపడ్డారు. జెత్వానీ తనను కలిసి ?నన్నే కలిసి మద్దతు కావాలని అడిగీతే నేను పోరాటం చేస్తానని ప్రకటించారు. ?సజ్జన్ జిందాల్ కోసం జగన్ ఇంత దారుణంగా దిగజారుతాడా అని మండిపడ్డారు. ?నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారని జగన్ చెప్పాడని.. ?కేవలం ఫోర్జరీ సంతకం కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఆమె వెనక పడటం ఘోరమన్నారు. ?దీని విూద విచారణ వేగంగా జరగాలి ..?జగన్ కూడా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.