విశాఖపట్టణం, ఆగస్టు 16: జీవీఎంసీ స్టాడిరగ్‌ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. పదికి పది స్థానాల్నీ టీడీపీ అభ్యర్ధులు గెలుచుకుని వైసీపీకి షాక్‌ ఇచ్చారు. అదే ఊపులో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి చెక్‌ పెడుతుందని అందరు భావించారు. దాంతో అలెర్ట్‌ అయిన జగన్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని క్యాంపు రాజకీయాలకు తెరలేపే పనిలో పడ్డారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల నేతలను తాడేపల్లి పిలిపించుకుని విూటింగులు పెట్టారు. వారిని బెంగళూరు క్యాంపుకు కూడా తరలించారు. తీరా సీన్‌ కట్‌ చేస్తే టీడీపీ హుందాగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. దాంతో జగన్‌ ముఖంలో రిలాక్సేషన్‌ స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు.గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండిరగ్‌ కమిటీల ఎన్నికలో కూటమి విజయకేతనం ఎగురవేసింది. పదికి పది స్థానాలూ పొంది ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా, మిగిలిన వారితో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. మూడేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరువిూదున్న ఉన్న కూటమి.. స్థాయీ సంఘ ఎన్నికలను మూడేళ్ల తర్వాత క్లీన్‌ స్వీప్‌ చేసి వైసీపీ షాక్‌ ఇచ్చింది.స్థాయీ సంఘ ఎన్నికల్లో పది స్థానాలకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. కూటమి తరఫున పోటీలో నిలిచిన పది మంది టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అన్ని స్థానాలూ కూటమి వశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్పొరేటర్లు 12 మంది టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. దాంతో ఈ ఎన్నికల నాటికి వైసీపీకి కౌన్సిల్లో 47 మంది కార్పొరేటర్లు మిగిలారు.అందులో నలుగురు కార్పొరేటర్లు వైపీసీ పెద్దలు నిర్వహించిన శిబిరానికి డుమ్మా కొట్టారు. వారి మద్దతుతో కూటమి బలం 53కు చేరింది. గెలిచిన టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లు చూస్తే వైసీసీ నుంచి భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు స్పష్టమైంది. ఒకటి నుంచి అత్యధికంగా 13 ఓట్ల వరకు వైసీసీ కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయడం గమనార్హం. స్థాయీ సంఘ ఎన్నికల్లో విజయంతో విశాఖ కూటమి నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికపై గురిపెట్టారు.జీవీఎంసీ ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్‌ చేయాలని చూసిన కూటమి నేతల ఆశలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేకులు వేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవాలంటే పెద్ద కష్టం కాదు. అయితే హూందా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఫైనల్‌ డెసిషన్‌ తీసుకున్నారు. అప్పట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, దౌర్జన్యాలతో టీడీసీ పోటీ చేయలేదు. అయితే అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు వస్తున్నారు. అయితే ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అంత ప్రయాస పడనవసరం లేదని ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్ధి పార్టీ నుంచి చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన సీబీఎన్‌ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు.టీడీపీ నిర్ణయం ప్రకటించడానికి ముందే ఎమ్మెల్సీ ఎన్నికపై మాజీ సీఎం జగన్‌ అప్రమత్తమయ్యారు. జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లి ప్యాలెస్‌లో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్‌ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్‌ భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ తిరుగులేని మెజార్టీలు ఉన్నాయని టీడీపీకి తగిన సంఖ్య బలం లేదని.. అయినా టీడీపీ అనైతికంగా పోటీకి దిగుతుందని విలువలు, విశ్వనీయతల గురించి తెగ మాట్లాడేశారు.టీడీపీ నిర్ణయం వెలువరించడానికి ముందు కూడా జగన్‌ స్థానిక నేతలతో విూటింగులు పెట్టడానికి షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. అయితే టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో.. జగన్‌ ఒకింత రిలాక్స్‌ అయినట్లు కనిపించారు. విలువలు, విశ్వసనీయత అంటూ బేలగా మాట్లాడిన జగన్‌ వాయిస్‌లో స్పష్టంగా తేడా కనిపించింది. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం. ఎందుకంటే.. తాము ఎవరినీ మోసం చేయలేదు. అబద్ధాలు చెప్పలేదని మళ్లీ కాన్ఫిడెన్స్‌ ప్రదర్శిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *