అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం:-గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల భూములను కబ్జా చేసి ఆ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా వైసిపి జిల్లా కార్యాలయాలను నిర్మించిన ఘనత గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రవాణా, క్రీడా,యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాలు మేరకు ఆయన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న వైసిపి జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యాలయ నిర్మాణం గురించి ఆయన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డిఓ రంగస్వామి లతో చర్చించి ఆరా తీశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తే ఏదో జిల్లాలు అభివృద్ధి జరుగుతాయని అనుకున్నామన్నారు. కానీ గడిచిన ఐదేళ్ల కాలంలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 26 జిల్లాలలో ప్రజల భూములను కాజేసి వైసిపి జిల్లా కార్యాలయాల కోసం పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారనీ ఆరోపించారు. గతంలో రాజులు కూడా ఇలాంటి కోటలను నిర్మించి ఉండరనీ ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో వైసీపీ కార్యాలయాల నిర్మాణం బాధ్యతలను రామ్ కి సంస్థకు అప్పగించడం జరిగిందని ఆయన ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా చర్యలు తీసుకొని ప్రజా ప్రయోజనాల కోసం ఈ భవనాలను వినియోగిస్తామంటూ మంత్రి వెల్లడించారు.