లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దేశాన్ని మరోసారి సంకీర్ణ రాజకీయాల యుగంలోకి తీసుకెళ్లాయి. పదేళ్ల తర్వాత ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా తీర్పు చెప్పారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ఓటర్లు బీజేపీకి 240 సీట్లే కట్టబెట్టడంతో కొంత నిరాశ ఎదురైనా ఎన్‌డీఏకు మెజారిటీ రావడంతో కమలనాథులు సంతృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. బీజేపీ సొంతంగా 272 సీట్ల మెజారిటీకి మార్క్‌ చేరుకోలేకపోయినా, ఎన్‌డీఏ కూటమిగా 292 సీట్లు సాధించింది. దాంతో సునాయాసంగా కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయబోతోంది. 2014, 2019 ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్రమోడీ తన పాలనలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఎన్‌డీఏలో కీలక భాగస్వాములుగా మారిన టీడీపీ, జేడీయూ, ఎల్‌జేపీ, షిండే శివసేన, ఎన్సీపీ తదితర పార్టీల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిందే. అయితే బీజేపీకి మెజారిటీ మార్క్‌ దాటకపోవడానికి గల కారణాలపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా యూపీలో ఠాకూర్లు, గుజ్జర్లు బీజేపీకి అండగా నిలబడలేదని తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మారుస్తారనే విపక్షాల ప్రచారం ఠాకూర్లకు ఆగ్రహం తెప్పించడం వల్లే బీజేపీకి సీట్లు తగ్గాయని అంటున్నారు. అలాగే మహారాష్ట్రలో శివసేన, న్సీపీ పార్టీలను చీల్చడ మహారాష్ట్ర ఓటర్లకు ఆగ్రహన్ని తెప్పించాయి. దాని ఫలితంగా బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. వీటికి తోడు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి చేసిన ప్రచారం దెబ్బ హిందీ రాష్ట్రాలలో బిజెపి స్ట్రయిక్‌ రేటును తగ్గించింది.ఇటు ఇండియా కూటమి అనూహ్యాంగా పుంజుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇండియాకు 234 సీట్లు తెచ్చుకుని మెజారిటీ మార్క్‌కు దూరంగా ఆగిపోయింది. అ. విపక్షంలో కూర్చుంటామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించకపోవడంతో, ఆ కూటమి అధికారం కోసం ప్రయత్నిస్తుందనే చర్చ జరుగుతోంది. మెజారిటీకి 38 సీట్లు తక్కువగా ఉండడంతో నితీష్‌, చంద్రబాబు మద్దతు కోసం ఇండియా కూటమి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్జిట్‌ పోల్స్‌, ఎగ్జాయిట్‌ పోల్స్‌ కు వ్యత్యాసం కనిపించింది. పదేళ్లు పూర్తి మెజారిటీతో ఉన్న బీజేపీ బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాలేదు. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మిత్ర పక్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఈ సారి బడ్జెట్‌ ఏ విధంగా ఉండబోతోందనే దానిపై సర్వత్రా చర్చ జరగుతోంది. గత బడ్జెట్‌ వరకు ఎన్డీయే ప్రభుత్వం దృష్టి అంతా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపైనే నిలిపింది. కానీ ఇప్పుడు మిత్రపక్షాలకు కానుకలు ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కొత్త ప్రభుత్వం జూలైలో 2024`25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్‌ పెడుతుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కు అనుగుణంగా సీట్లు వస్తే పరిస్థితి మరోలా ఉండేది. ప్రభుత్వం మొత్తం బడ్జెట్‌ మూలధన వ్యయంపై దృష్టి పెట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. సంకీర్ణ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోంది, ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వ ఎజెండాలో కూడా మార్పు కనిపిస్తుంది.విశ్లేషకుడు శైలేంద్ర భట్నాగర్‌ ఈ సారి మోడీ ప్రభుత్వం పెట్టే బడ్జెట్‌ 2024`25లో ఏమి భిన్నంగా కనిపించవచ్చో వివరించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి బడ్జెట్‌లో దాని ప్రభావం కనిపిస్తుందని అన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు పీఎం మోడీ తన ప్రభుత్వం మూడోసారి ఎన్నికైతే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కానీ ఫలితాలు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి.ఆర్థిక వ్యవస్థ వేగానికి సంబంధించి మోడీ ప్రభుత్వం వెనుకడుగు వేసే మూడ్‌లో లేనట్లు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని హావిూ ఇచ్చారు. అయితే, ఈ ఏడాది పూర్తి బడ్జెట్‌లో మోడీ మహిళలు, రైతులు, యువత కోసం పెద్ద ప్రకటనలు చేస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు.
Iపీఎం ఆవాస్‌ మోజన కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించామని, వచ్చే ఐదేళ్లలో గ్రావిూణ ప్రాంతాల్లో మరో 2 కోట్లు నిర్మిస్తామని చెప్పారుIగర్భాశయ క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తాం, 9`14 సంవత్సరాల బాలికలకు ఉచిత వ్యాక్సినేషన్‌ చేస్తామని వివరించారు.Iఇప్పటి వరకు కోటి మంది మహిళలను లక్‌ పతి దీదీగా మార్చారు. ఈ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచారు.Iఖఓ గతి శక్తి కింద 3 కొత్త కారిడార్లు నిర్మిస్తాం, రాబోయే 10 సంవత్సరాల్లో విమానాశ్రయాల సంఖ్య 149 కి పెంచుతాం.
Iవందే భారత్‌కు చెందిన 40,000 బోగీలను అప్‌గ్రేడ్‌ చేస్తాం. మెట్రో, నమో భారత్‌ ఇతర నగరాలకు అనుసంధానిస్తాం.లోక్‌ సభ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొత్తగా ఏవైనా చేరుస్తారని భావిస్తున్నారు. సామాన్యులకు పన్ను రాయితీ, రైతుల కోసం ప్రత్యేక ప్రకటనలు, ఇదే కాకుండా, ప్రధానమంత్రి ఉజ్వల పథకం వంటి ఇతర పథకాన్ని తీసుకురావచ్చు. అయితే, వీటితో పాటు, ఆర్థిక వ్యవస్థ వేగాన్ని కొనసాగించేందుకు మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగంపై దృష్టి పెడుతుంది.నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రింగా ఇప్పటివరకు పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నడిపారు. తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించబోతున్న నరేంద్రమోదీ ఆ దిశగా పట్టువిడుపులతో, భాగస్వాముల ఆకాంక్షలను సంతృప్తి పరుస్తూ పాలనను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిరది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *