లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ముగిసింది. ఏడు దశల్లో ఈ పోలింగ్‌ మొదలు కాగా.. శనివారంతో ఇది ముగిసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోలింగ్‌ మూసిన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ తమ అంచనాలను వెల్లడిస్తాయి. లోక్‌ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరిగాయి. దీంతో అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై విపరీతంగా చర్చ నడుస్తోంది. ఎన్నికలు నిర్వహించే సమయంలో ఒపీనియన్‌ పోల్స్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ సందడి మొదలవుతుంది. ఓటరు నాడి పట్టుకునేందుకు అనేక విూడియా సంస్థలు, ఇతర ఏజెన్సీలతో సర్వేలు నిర్వహిస్తుంటాయి. పోలింగ్‌ కు ముందు నిర్వహించే వాటిని ఒపీనియన్‌ పోల్స్‌ అంటారు. సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనలకు అనుగుణంగా పలు సంస్థలు ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహిస్తాయి. పార్టీల మధ్యపొత్తు, ఇతర వ్యవహారాల ఆధారంగా పలు సంస్థలు వివిధ దశల్లో ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడిస్తాయి. ఇక ఓటర్ల నాడి పసిగట్టేందుకు పలు ఏజెన్సీలు సర్వేలు నిర్వహిస్తాయి. సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే రైతులు, యువతి యువకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారి నుంచి సర్వే సంస్థలు అభిప్రాయాలు సేకరిస్తాయి. ఆ తర్వాత ఒపీనియన్‌ పోల్స్‌ ను వెల్లడిస్తాయి. ఒపీనియన్‌ పోల్స్‌ అనేవి సందర్భాలను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఎన్నికలకు ముందు పది రాజకీయ పార్టీలు వివిధ సంస్థల ద్వారా ఇలాంటి ఒపీనియన్‌ పోల్స్‌ ను నిర్వహిస్తాయి. అందులో వచ్చిన ఫలితాలు ఆధారంగా తమ అడుగులు వేస్తాయి.ఎన్నికల పూర్తయిన తర్వాత.. వెల్లడిరచే వాటిని ఎగ్జిట్‌ పోల్స్‌ అంటారు.. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగిన అనంతరం పోలింగ్‌ బూత్‌ లో ఓటర్ల నుంచి సమాచారం సేకరిస్తారు. ఓటర్లు చెప్పిన సమాధానం ఆధారంగా ఒక అంచనాకు వస్తారు. ఏ పార్టీకి ఎంత ఓటింగ్‌ వస్తుంది? ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఎంతమంది ప్రజల మనసు గెలుచుకుంటుంది? అనే అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్‌ పోల్స్‌ ను ప్రకటిస్తారు.ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. ముందుగానే చెప్పినట్టు ఒపీనియన్‌ పోల్స్‌ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఒపీనియన్‌ పోల్స్‌ ఎన్నికల ముందు నిర్వహిస్తుంటారు కాబట్టి.. ఆ సమయంలో ఓటర్‌ మూడ్‌ ను అవి ప్రతిబింబిస్తుంటాయి. అదే ఎగ్జిట్‌ పోల్స్‌ విషయానికొస్తే అలా ఉండదు. ఎన్నికల తర్వాత ఓటర్‌ వేసిన ఓటు ఆధారంగానే అవి ఉంటాయి కాబట్టి.. ఫలితాలను దాదాపుగా ప్రతిబింబిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.ముఖ్యంగా ఏపీ ఎన్నికల విషయంలో ఈ చర్చ రసవత్తరంగా మారింది. వైసిపి, కూటమి? రెండిట్లో ఏది అధికారంలోకి వస్తుందో అంతు పట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ కు.. ఎగ్జాక్ట్‌ పోల్స్‌ కు మధ్య తేడా ఉంటుందా? ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రామాణికత ఎంత? గత ఎన్నికల్లో వాస్తవానికి దగ్గరగా ఫలితాలు ఇచ్చాయా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు, తుది ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే.. అంచనాలు తప్పినట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీకి సంబంధించి అంచనా వేయడంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పాయి. విజయం సాధిస్తాయని చెప్పడంలో మాత్రం సక్సెస్‌ అయ్యాయి.2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ నాలుగు ఎగ్జిట్‌ పోల్స్‌ యూపీఏ విజయాన్ని తక్కువగా అంచనా వేశాయి. యూపీఏకు 195, ఎన్డీఏ కు 185 సీట్లు వస్తాయని అంచనా వేయగలిగాయి.అయితే అప్పుడు యూపీఏ కు 252 సీట్లు, ఎన్డీఏకు 158 సీట్లు లభించాయి. యూపీఏ కూటమిలోని కాంగ్రెస్‌ పార్టీకి 206 సీట్లు, ఎన్డీఏ కూటమిలోని బిజెపికి 116 సీట్లు వచ్చాయి.2014 ఎన్నికల్లో సైతం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పాయి. దాదాపు 8 ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కు 283 సీట్లు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కు 105 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. మోడీ వేవ్‌ పెరుగుతుందని పసిగట్టలేకపోయాయి. సంస్థల అంచనాలను తారుమారు చేస్తూ ఎన్డీఏ 336 సీట్లను గెలుచుకుంది. యూపీఏ కేవలం 60 స్థానాలకే పరిమితం అయ్యింది. ఒక్క బిజెపికే 282 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌ పార్టీ 44 స్థానాలకు పరిమితం అయ్యింది.2019 ఎన్నికల్లో సైతం ఎగ్జిట్‌ పోల్స్‌ అనుకున్న స్థాయిలో అంచనాలు సక్సెస్‌ కాలేదు. ఎన్డీఏ కూటమి 306 సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి 13 ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు. కానీ ఏకంగా ఎన్డీఏ 353 సీట్లు గెలుచుకోవడం గమనార్హం. ఒక్క బీజేపీ మాత్రమే 303 స్థానాలను గెలుచుకుంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఇలా అంచనాలు తప్పుతున్నా? ప్రజల్లో మాత్రం వాటిపై ఆసక్తి తగ్గడం లేదు.ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడయ్యాయి.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎగ్జిట్‌ పోల్స్‌ క్లియర్‌ కట్‌ గా చెప్పాయి.ఏపీలవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వైసిపి ఒంటరి పోరుకు మొగ్గుచూపింది. టిడిపి, బిజెపి, జనసేన కూటమి కట్టాయి. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లలో పోటీ చేసింది. బిజెపి 10 అసెంబ్లీ,ఆరు లోక్సభ స్థానాల్లో బరిలో దిగింది. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంది. దేశవ్యాప్తంగా నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్‌ జరిగింది. జూన్‌ 4న ఫలితాలను ప్రకటించనున్నారు. అధికారానికి కావలసిన మ్యాజిక్‌ ఫిగర్‌ 88. దీంతో వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఆసక్తికరంగా మారాయి.అయితే మెజారిటీ జాతీయ సర్వే సంస్థలు టిడిపి కూటమికే చాన్స్‌ అని తేల్చేశాయి. 21 నుంచి 23 పార్లమెంట్‌ స్థానాలు కూటమికి రావచ్చని ఇండియా టుడే అంచనా వేసింది. మూడు పార్టీల మధ్య సమన్వయం కుదిరిందని తేల్చి చెప్పింది. ఓట్ల బదిలీ సవ్యంగా జరిగిందని స్పష్టం చేసింది. చంద్రబాబు అరెస్టు తర్వాత టిడిపి బలపడిరదని అభిప్రాయపడిరది. ఏబీసీ సిఓటర్‌ ఏకపక్షంగా టిడిపికి ఫలితాలు ఇచ్చింది. 21 నుంచి 25 పార్లమెంటు స్థానాలను ఓటమి గెలుచుకునే ఛాన్స్‌ ఉందని వెల్లడిరచింది. ఇండియా టీవీ సైతం టిడిపి కూటమికి జై కొట్టింది. 19 నుంచి 23 పార్లమెంట్‌ స్థానాలు రావచ్చని అంచనా వేసింది. న్యూస్‌ 18 సైతం టిడిపి కూటమిదే హవా అని తేల్చి చెప్పింది. 19 నుంచి 22 స్థానాలు రావొచ్చని స్పష్టం చేసింది. ఒకట్రెండు సర్వే సంస్థలు తప్ప అన్ని కూటమికే జై కొట్టడం విశేషం.అయితే వైసీపీకి మొగ్గు చూపిన సర్వే సంస్థలు సైతం కొద్దిపాటి అధిక్యతనే చూపడం విశేషం. అటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన జాతీయ స్థాయి విూడియా సంస్థలు టిడిపి కూటమి భారీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి. ఇండియా టీవీ సిఎన్‌ఎక్స్‌, సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18, ఏబీపీ సి ఓటర్‌, టుడేస్‌ చాణక్య, పి మార్క్‌, జంకి బాత్‌, రిపబ్లిక్‌ టీవీ మాట్రిజ్‌, ఇండియా టుడే సంస్థల సర్వేలు కూటమి విజయాన్ని అంచనా వేశాయి. ఒక్క టైమ్స్‌ నౌ సిటీ జి మాత్రం వైసిపి రెండోసారి గెలవబోతున్నట్లు అభిప్రాయపడిరది.అయితే ఈసారి కేకే సంస్థ ఆసక్తికర ఫలితాలను ప్రకటించింది. గత ఎన్నికల్లో వైసీపీకి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆ ఎన్నికల్లో 151 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇప్పుడు అదే సంస్థ కూటమికి 161 సీట్లు వస్తాయని తేల్చి చెప్పడం విశేషం. అయితే ఇందులో టిడిపికి ఒక్కదానికే 133 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేల్చి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో ఆ పార్టీదే విజయం అని తేల్చింది. పది చోట్ల పోటీ చేసిన బిజెపి ఏడు స్థానాలను సాధిస్తుందని కూడా చెప్పడం విశేషం. వైసిపి కేవలం 14 స్థానాలకు పరిమితం అవుతుందని.. జనసేన అతిపెద్ద పార్టీల్లో రెండవదిగా నిలుస్తుందని తేల్చి చెప్పడం సంచలనంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తూ సక్సెస్ఫుల్‌ సంస్థగా పేరుపొందిన పీపుల్స్‌ పల్స్‌ సంస్థ కూడా కూటమికి భారీ విజయం కట్టబెట్టింది. 135 సీట్ల వరకు రావచ్చు అని తేల్చి చెప్పింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *