రాజన్న సిరిసిల్ల:గుండెపోటు తో కుప్పకూలిన మహిళకు సిపి ఆర్ చేసి ప్రాణాలు కాపాడి ఆ కుటుంబం పాలిట దేవుడయ్యిండు. సిపీ ఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. కుప్పకూలిన సిరిసిల్ల పట్టణానికి చెందిన గాంధీ నగర్ కు చెందినా చిలగాని అనూహ్య అనే మహిళ బంధువు మరణ వార్త విని గుండెపోటు తో కుప్పకూలింది, ఇంట్లో నుండి కేకలు వినబడడంతో తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న గడ్డమిది శ్రీనివాస్ వెంటనే స్పందించి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి ఆమెకు సీపీ ఆర్ చేసాడు. అనంతరం సవిూపంలోని ఆస్పత్రికి తన సొంత వాహనంలో తరలించారు.
కానిస్టేబుల్ చాకచక్యంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమెకు తారక రామారావు హాస్పటల్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నరు. సీపీ ఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఈ సందర్బంగా అభినందించిన పలువురు నెటిజన్లు. గుండెపోటు, వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీ ఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టిందనే చెప్పాలి.