ఒక గ్రామ్ కణజాలంలో 329.44 మైక్రోగ్రాముల మేర మైక్రోప్లాస్టిక్
పురుష సంతానోత్పత్తిపై ప్రభావం లి న్యూ మెక్సికో వర్సిటీ అధ్యయనం
హైదరాబాద్, మే 27: మైక్రోప్లాస్టిక్ కారణంగా పురుష సంతానోత్పత్తిపై ప్రభావం చూపే ప్రమాదమున్నదని పరిశోధకుడు జియోజంగ్ యూ పేర్కొన్నారు. పురుషుడి సంతానోత్పత్తికి కీలకమైన వృషణాల్లోనూ మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్టు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు. మగ కుక్కలు, పురుషులపై ఈ అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు. కుక్కలతో పోలిస్తే పురుషుల వృషణాల్లో మూడు రెట్లు ఎక్కువగా మైక్రోప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించామన్నారు. వృషణాల్లో 12 రకాల మైక్రోప్లాస్టిక్ రేణువులను కనుగొన్నామని.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ తయారీకి వాడే పాలీఇథైలీన్ (పీఈ), పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) కూడా ఇందులో ఉన్నట్టు వెల్లడిరచారు.ఒక్క వృషణాల్లోనే కాదు మనుషుల రక్తం, గుండె, ఆఖరికి గర్భిణుల మావిలో (పిండం) కూడా మైక్రోప్లాస్టిక్ అవశేషాలను కనుగొన్నట్టు పరిశోధకులు వెల్లడిరచారు. 62 మంది గర్భిణుల మావి నమూనాలను పరీక్షిస్తే.. ప్రతీ గ్రాము కణజాలంలో 6.5 నుంచి 790 మైక్రోగ్రాముల మేర మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్టు వివరించారు.పురుషులలో 329.44 మైక్రోగ్రాములు
కుక్కలలో 122.63 మైక్రోగ్రాములు ఉన్నట్లు గుర్తించారు.