వీరిపై మొత్తం 41 లక్షల రివార్డు :పోలీసుల వెల్లడి
బీజపూర్‌ మే 20 Ñమొత్తం 41 లక్షల రివార్డు కలిగి ఉన్న14మంది నక్సల్స్‌ ఛత్తీస్‌గడ్‌ లోని బీజపూర్‌ జిల్లాలో అరెస్ట్‌ అయ్యారని బీజపూర్‌ పోలీస్‌ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిరచారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారని తెలిపారు. గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని ముట్వెండి అటవీ ప్రాంతం, పిడియా గ్రామాల్లో ఆదివారం డిఆర్‌జి, జిల్లా పోలీస్‌ల సంయుక్త బృందం వీరిని పట్టుకోగలిగిందని చెప్పారు. 14 మంది నక్సల్స్‌లో రేణు కొసవి , మంగ్లీ అవ్లంలకు ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. వీరిద్దరూ మిలిటరీ కంపెనీ నెంబరు 2 కు చెందిన వారు. గంగలూరు ఏరియా కమిటీ సభ్యులు బిచ్చెం యుయికా, షర్మిలా కుర్సం, లక్ష్మీతాటి ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.మరో నలుగురు క్యాడర్లకు రూ. 2లక్షల వంతున, మిగతా ఇద్దరికి లక్ష వంతున రివార్డులు ఉన్నాయని పోలీస్‌లు ప్రకటనలో వివరించారు. వారి దాచి ఉంచిన నాలుగు టిఫిన్‌ బాంబులు, రెండు కుకర్‌ బాంబులు, డిటొనేటర్లు, కార్డెక్సు వైర్‌, జిలటిన్‌ స్టిక్స్‌, ఫైర్‌క్రాకర్లు, మావోయిస్టుల సంబంధిత మెటీరియల్‌ వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈనెల 10న ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్‌ను హతమార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి వివరాలు పోలీస్‌లు ఇంకా తెలియజేయలేదు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమని గ్రామస్థులు, ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీస్‌లు కొట్టి పారేశారు. వీరందరి తలపై నగదు బహుమతులున్నాయని వివరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *