ప్రజల అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్: మంత్రి రోజా.

చిత్తూరు జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతి మనిషి గురించి ఆలోచించి వారి ఆరోగ్యం, వారి పిల్లల ఎడ్యుకేషన్, వారి ఊరి అభివృద్ధి గురించి ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా అన్నారు. నగరి గ్రామీణ మండలం బీరకుప్పం లో మంగళవారం జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఆమె పాల్గొని ప్రసంగించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారని అది అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని నెరవేరుస్తూ..మీకు వాగ్దానం చేయని జగనన్న సురక్ష కార్యక్రమం కూడ అమలుచేస్తున్నారని తెలిపారు.ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నారని మన ఇంట్లో మన ఆరోగ్యం గురించి ఎలా అయితే చిత్తశుద్ధిగా ఆలోచిస్తారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారని,ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలన్నదే సీఎం జగన్ ధ్యేయమని మంత్రి అన్నారు.వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా పరీక్షలు చేయడం జరిగిందని,ఈరోజు మీ సచివాలయం పరిధిలో ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈరోజు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా అన్ని చోట్ల కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి వాళ్ళకి యూనిఫామ్, వాళ్ళకి పౌష్టిక ఆహారం అందిస్తున్నామని చెప్పారు.జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఈరోజు 600 మందికి వైద్య పరీక్షలు అలాగే 50 మందికి కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం జరిగింది అలాగే 80 మందికి ఇల్లు పట్టాలు కూడా అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంపీపీ, చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆశా వర్కర్లు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *