అవ్వా తాతలుకు ఆసరాగా నిలుస్తున్న సీఎం జగన్
ఎన్నికల హామీలను 99 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుంది…
సంబేపల్లె మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
అవ్వా తాతలుకు సీఎం జగన్ ఆసరాగా నిలిచారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మంగళవారం సంబేపల్లె మండలంనకు సంబంధించి ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఎంపిపి ఆవుల నాగశ్రీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్అందిస్తుండడంతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్నారు.వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి అవ్వాతాతలు, వితంతువులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికి 2271 నూతనపెన్షన్లు మంజూరు కాగా అందులో సంబేపల్లె మండలానికి 340 పెన్షన్లు మంజూరు అయ్యాయన్నారు. నూతన పెన్షన్లతో కలిపి సంబేపల్లె మండలంలోనే 5538 పెన్షన్లు పంపిణీ అవుతున్నాయన్నారు. నెలకు పెన్షన్ల క్రింద రాయచోటి నియోజక వర్గ పరిధిలో రూ 13 కోట్లు, సంవత్సరానికి రూ 150 కోట్లు,రాష్ట్ర వ్యాప్తంగా అయితే రూ 1900 కోట్లు, నాలుగేళ్ళలో రూ లక్ష కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతుండడం ఒక రికార్డు అని అన్నారు.
గతంలో కొత్త పెన్షన్ రావాలంటే ఒకరు చనిపోతేనే మంజూరు చేసేవారు…
గతంలో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేదన్నారు. జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను పల్లెలకు వెళ్లినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం నెలకు రూ 400 కోట్లను మాత్రమే ఖర్చు చేసే వారన్నారు.ఇప్పుడు జగన్ పాలనలో నెలకు పెన్షన్ల కోసం రూ 2 వేల కోట్లను ఖర్చు పెడుతున్నారన్నారు.
జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకోండి…
చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయ న్నారు. జగన్ పాలనలో అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకుని ప్రజలు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి ని చేసేందుకు ఆశీర్వదించాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎంఎల్ఏ లుగా గెలవలేని లోకేష్,పవన్ లు జగన్ ను విమర్శించడమా?
ఎంఎల్ఏ లుగా గెలవలేని లోకేష్,పవన్ లు జగన్ ను విమర్శించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.నారా లోకేష్ తన మీటింగులలో తమకు ఎదురువచ్చిన వారిని రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నానని, ఉచ్చ పోయిస్తానని , ఏమి పీక్కుంటారని అని రెచ్చిపోయి మాట్లాడారన్నారు.
స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు…
స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికారన్నారు.రూ 350 కోట్ల నిధులు స్వాహా చేశారన్న బలమైన ఆధారాలున్నాయి.ప్రజల్లో సానుభూతిని పొందేందుకు, రాజకీయంగా వాడుకునేందుకు టి డి పి, పచ్చమీడియా కలసి చేసిన మోసాన్ని అన్యాయంగా ఇరికించారని విష ప్రచారం చేసుకుంటున్నారన్నారు. జైల్లో దోమలు కుడుతున్నాయని, ఏ సి కావాలని చంద్రబాబు చెప్పుచుండడం విడ్డూరంగా ఉందన్నారు.
పేదలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నందుకా సీఎం జగన్ ను విమర్శించేది?
పేదలను గుండెల్లో పెట్టుకుని చూసు కుంటున్నందుకా ప్రతిపక్షాలు సీఎంజగన్ ను విమర్శిస్తున్నారా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశించారు. పెన్షన్ల కోసం నెలకు రూ.1900 కోట్లును ఇస్తున్నందుకా? డిబిటి ద్వారా వివిధ సంక్షేమ పథకాల కోసం రూ 2లక్షల కోట్ల నిధులును ప్రజల ఖాతాలలో జమ చేసినందుకా? రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం,వంద పడకల ఆసుపత్రి, బస్ స్టాండ్ విస్తరణ,రైతు బజార్ తదితర అభివృద్ధి పనులు చేసినందుకా సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.నాడు నేడు తో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేసినందుకా అని ప్రశ్నించారు.ఆసరా,చేయూత,అమ్మఒడి, విద్యా దీవెన,వసతి దీవెన తదితర ఎన్నో పథకాలును అందుస్తున్నందుకా అని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
జనవరి నుంచి రూ 3 వేల పెన్షన్…
పాదయాత్రలో చెప్పిన మేరకు జగన్ పెన్షన్ మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చారని, వచ్చే ఏడాది జనవరి నుంచి రూ 3 వేలు పెన్షన్ అందిస్తారన్నారు.
జగనన్న పాలనలో నియోజక వర్గంలోని ఆలయాలకు మహర్దశ…
సీఎం జగన్ పాలనలో నియోజక వర్గంలోని ఆలయాలకు మహర్దశ కలిగిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సంబేపల్లె గ్రామంలోని శ్రీ దేవర రాయి నల్లగంగమ్మ తల్లి ఆలయానికి రూ 1.18 కోట్లు, పశుపతి నాధ ఆలయానికి రూ 1.22 కోట్లు, దేవపట్ల గ్రామంలో దేవపట్లమ్మ తల్లికి రూ 1.0 కోట్లు, శెట్టిపల్లె గ్రామంలోని నరసింహ స్వామి ఆలయానికి రూ 1 కోటి, చిన్నమండెం మండలంలోని దేవగుడిపల్లె వద్ద ఉన్న మండెం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు, మల్లూరు గ్రామంలోని మల్లూరమ్మ తల్లికి రూ 98 లక్షలు, కొత్తపల్లె లోని రామాలయానికి రూ 50 లక్షలు, రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయానికి రూ కోట్లాది నిధులుతో రాజగోపురం, మాడ వీధులు తదితర అభివృద్ధి పనులు జరుగుచున్నాయని, లక్కిరెడ్డిపల్లె అనంతపురం గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధి నిమిత్తం నిధులు మంజూరు దశలో ఉన్నాయన్నారు నియోజవర్గ వ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాలు నివాస ప్రాంతాలలో సుమారు 50 ఆలయాలు మంజూరు అయ్యాయన్నారు.
మీ బిడ్డగా..కుటుంభ సభ్యుడి వలే తోడుంటా…
నియోజక వర్గ ప్రజల కష్ట సుఖాలులో మీ బిడ్డగా, కుటుంభ సభ్యుడి వలే తోడుగా వుంటానని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.రెవెన్యూ లోని లోటుపాట్లను సరిచేస్తామన్నారు.అసైన్ మెంట్, చుక్కలభూముల కు సీఎం జగన్ న్యాయం చేశారన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగంచేసుకోవాలన్నారు.ఏడు రకాల రక్తపరీక్షలు నిర్వహించి ,అవసరమైన వారికి నాణ్యమైన ముందులు, చికిత్సలు,శస్త్ర చికిత్సలు అవసరమగు వారిని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు సిపారసు చేయడం జరుగుతుందన్నారు
డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు.మండలానికి 340 నూతన పెన్షన్లు కావడం హర్షదాయకమన్నారు.ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.సర్పంచుల సంఘ అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ను మళ్లీ సీఎం గా చేయాలన్నారు. మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు. సీనియర్ నాయకులు గొర్ల రమేష్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు .మండల జె సీఎస్ కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ అవ్వాతాతల ఆనందమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఎర్రపురెడ్డి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ సిపి కి శ్రీరామరక్ష అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నరసింహులు, తహసీల్దార్ మహేశ్వరి భాయి, వైస్ ఎంపిపి పొత్తూరు రవీంద్ర నాయుడు,వివి ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరమణ రెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి, నియోజక వర్గ బీసీసెల్ కన్వీనర్ నాగరాజు యాదవ్, జె సి ఎస్ కో కన్వీనర్ అమరనాధ రెడ్డి, సర్పంచులు అంచల రామచంద్ర,హసీనా నూర్ మోహన్, అమరనాధ రెడ్డి,రఘునాధ రెడ్డి,దండు నాగభూషన్ రెడ్డి,వెంకట రమణ నాయక్,పాల వెంకట రమణ నాయుడు , యువరాజు నాయుడు, , ఎంపిటిసి లు భద్రయ్య, శ్రీధర్ రెడ్డి, వరలక్ష్మి,రామరాజు, రఘు, మీసాల ఆంజనేయులు, నాయకులు వసంతు శ్రీనివాసులు రెడ్డి, వంగిమల్ల వేణుగోపాల్ రెడ్డి, లక్ష్మీకర్ రెడ్డి, వాయల్పాటి ఆనంద రెడ్డి,కిషోర్ రెడ్డి,కాకులపల్లె రమణారెడ్డి,గొల్లపల్లె సుబ్బారెడ్డి,మాజీ ఎంపిటిసి శివయ్య,మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ బుల్లి వెంకటరమణ,తిరుపాల్ నాయక్,ఆర్ ఎంపీ రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.