37 ఏళ్లలో 12 మంది సీఎంలు అగ్రవార్ణాలు.. 2 ఏళ్లలో 3 దళిత సీఎంలు.. బిహార్లో కొత్త చర్చను లేపుతున్న కులగణన.
కుల ప్రాతిపదికన జనాభా లెక్కల నివేదిక వెలువడిన తర్వాత జనాభా వారీగా వాటాల అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల అంశం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చలో ఉంది..
నిజానికి.. గత 76 ఏళ్లలో బీహార్‌లో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వారు 35 ఏళ్ల 89 రోజులు అధికారంలో ఉన్నారు. ఇదే కాలంలో అగ్రవర్ణాల వర్గాలకు చెందిన వ్యక్తులు వారి కంటే రెండేళ్లు ఎక్కువగా అధికారంలో అంటే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 37 ఏళ్ల 197 రోజులు పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు బిహార్ ముఖ్యమంత్రులుగా కొనసాగారు.
ఇక ఈ చర్చలో షెడ్యూల్డ్ కులాల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎస్సీ కేటగిరీ నుంచి ముగ్గురు వ్యక్తులు ముఖ్యమంత్రులు అయినప్పటికీ.. కేవలం ఒక సంవత్సరం మరియు 327 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు, అది కూడా ఒక సంవత్సరం 283 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు..
ఇక ఈ చర్చలో షెడ్యూల్డ్ కులాల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎస్సీ కేటగిరీ నుంచి ముగ్గురు వ్యక్తులు ముఖ్యమంత్రులు అయినప్పటికీ.. కేవలం ఒక సంవత్సరం మరియు 327 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు, అది కూడా ఒక సంవత్సరం 283 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు..
ఓబీసీలో ఐదుగురు వ్యక్తుల మధ్య 35 ఏళ్ల పాలన ఉంది
గత 35 సంవత్సరాలలో, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల మధ్యే అధికారం మారుతోంది. ఓబీసీ వర్గానికి చెందిన ఏడుగురు వ్యక్తుల మధ్యనే ముఖ్యమంత్రి కుర్చీ తిరుగుతోంది. ఇందులో గరిష్టంగా నితీష్ కుమార్ 17 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రబ్రీ దేవి ఏడేళ్ల 190 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక లాలూ ప్రసాద్ ఏడేళ్ల 130 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. బీహార్‌లో దరోగా రాయ్ 310 రోజులు, సతీష్ ప్రసాద్ సింగ్ 5 రోజులు, బీ.పీ.మండల్ 51 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు..
37 ఏళ్లలో 12 మంది అగ్రవర్ణాల వారు సీఎం అయ్యారు
గత 76 ఏళ్లలో బీహార్‌లో అగ్రవర్ణాల అగ్రవర్ణాల ఉనికిని బట్టి చూస్తే ఈ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు 37 ఏళ్ల 197 రోజులు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. అయితే వారిలో ఇద్దరు మాత్రమే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పదవీకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగిలినవారు గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. మొదటి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ 17 సంవత్సరాల 52 రోజులు పనిచేశారు. రెండో స్థానంలో జగన్నాథ్ మిశ్రా ఐదేళ్ల 180 రోజుల పాటు బీహార్ పగ్గాలు చేపట్టారు..
కాగా, కే.బీ.సహాయ్ మూడేళ్ల 154 రోజులు, బిందేశ్వరి దూబే రెండేళ్ల 338 రోజులు, వినోదానంద్ ఝా రెండేళ్ల 226 రోజులు, చంద్రశేఖర్ సింగ్ ఒక సంవత్సరం 210 రోజులు, కేదార్ పాండే ఒక సంవత్సరం 105 రోజులు, భగవత్ ఝా ఆజాద్ ఒక సంవత్సరం 24 రోజులు, మహామాయ ప్రసాద్ సింగ్ 329 రోజులు బీహార్‌లో సత్యేంద్ర నారాయణ్ సిన్హా 270 రోజులు, హరిహర్ సింగ్ 117 రోజులు, దీప్నారాయణ్ సింగ్ 17 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. బీహార్‌లో షెడ్యూల్డ్ కులాల ప్రజలు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే వారిలో ఎవరూ ఈ పదవిపై ఒక సంవత్సరం పదవీకాలం పూర్తి చేయలేదు. రాంసుందర్ దాస్ 302 రోజులు, జితన్ రామ్ మాంఝీ 278 రోజులు, భోలా పాశ్వాన్ శాస్త్రి 112 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ గఫూర్ ఏడాది 283 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు..