చంద్రబాబు అక్రమ అరెస్టుపై గాంధీజీ సాక్షిగా నిరసన

వీరబల్లి : చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం గాంధీ జయంతి రోజున మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మండల టిడిపి అధ్యక్షులు ఎం. బానుగోపాల్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు .మొదట గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .అనంతరం నల్ల బ్యాడ్జి లు ధరించి వైసిపి ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు .ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు భానుగోపాల్ రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం, దౌర్జన్యాలు, అక్రమాలు, హత్యలు, ఆక్రమణలు ,అవినీతి తప్ప ఇక ఏమి లేవన్నారు. జాతిపిత గాంధీజీ కోరుకున్నట్లు ఈ రాష్ట్రంలో శాంతి ఎక్కడ కనుచూపుమేరలో కనిపించడం లేదన్నారు. అన్ని వ్యవస్థలను దుర్వినియోగ పరుస్తూ పోలీస్ శాఖ లోని కొందరు అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి, ప్రభాకర్ హనాయుడు,తెలుగుయువత జిల్లా కార్యదర్శి నేతి రమేష్ బాబు, రాయ గంగయ్యనాయిడు,బిసి నాయికులు తుమ్మల రమేష్ , వి ఆర్ డి యస్ సురేంద్ర రెడ్డి,వి .ఆంజినేయిలు,రామక్రిష్ణ రాజు,నాగప్ప నాయిడు,,రమణ,రెడ్డయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *