జగన్ దిగిపోయే దాకా పోరాటం ఆగదు..
జాతి పిత మహాత్మా గాంధీ చూపించిన మార్గం లోనే నిరసన సాగిస్తాం…
….. ఆర్ రమేష్ కుమార్ రెడ్డి
……. **మాజీ శాసనసభ్యులు
తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇంచార్జ్
*అన్నమయ్య జిల్లా : ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి దిగి పోయేదాకా పోరాటం ఆగదు అని ,జాతి పిత మహాత్మా గాంధి గారు చూపించిన మార్గం లోనే నిరసన కార్యక్రమాలు చేపడతామని మాజీ శాసనసభ్యులు రాయచోటి టిడిపి ఇంచార్జ్ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ను మొదటగా జాతి పిత మహాత్మా గాంధి గారి జయంతి పురస్కరించుకొని గాంధి గారి పటానికి పూల మాల వేసి ప్రారబించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు రోడ్ షోలకు , నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజలు నీరాజనం పడుతుండగా చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కక్ష కట్టి చంద్రబాబునాయుడు పై అక్రమ కేసులు నమోదు చేయించి జైలుకు పంపారన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. 2024 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు పగ్గాలు చేపట్టడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచడంతో దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు నిరసన , ర్యాలీలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చంద్రబాబు గారికి ప్రజల మద్దతు ఉందన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలని నినాదాలు కూడా చేశారు.జగన్ రాష్ట్రం లో పాలన గురించి ఆలోచన చేయడం లేదని కేవలం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను ఏవిధంగా జైలు కు పంపిచాలనే ఆలోచిస్తున్నారని అన్నారు దేశం లో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు ..ఇకనైనా చంద్ర బాబు గారి ని విడుదల చేయకపోతే గాంధి గారు చూపించిన మార్గం లోనే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్య క్రమం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బాషా, రాయచోటి రూరల్ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి నిస్సార్ అహ్మద్ , మాజీ జెడ్పిటిసి మల్లు నర్సారెడ్డి గారు , సత్యారెడ్డీ ,నాగేశ్వర నాయుడు , పార్థసారధి రెడ్డి , రాఘవ, వాసు, రామకృష్ణ గౌడ్, మహబూబ్ బాషా, బాబు రెడ్డి, రమేష్ రెడ్డి, రియాజ్, చిన్నావుల వెంకటరమణారెడ్డి, సుబ్బయ్య నాయుడు, ప్రభాకర్ రెడ్డి ,ఆంజనేయులు, నాయక్, రమేష్, బాబు, శ్రీనివాసులు రెడ్డి, పెంచల్ రెడ్డి, సహదేవరెడ్డి, మహబూబ్ బాషా, ముబారక్, రవిశంకర్ రెడ్డి, కేశవులు, రాఘవేంద్ర, జయరాం రెడ్డి, పెద్దరెడ్డెయ్య యాదవ్, రామాంజనేయులు యాదవ్, మంజూర్, మహబూబ్ పీర్ , శ్రీను, నాగయ్య, రియాజ్, అల్లాబకాస్ ,ఇస్మాయిల్, సహదేవ ,ప్రసాద్, హజరత్, రవి, శివ, కరుణాకర్ మరియు నియోజక వర్గం లోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.