సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ మరో సున్నిత అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ‘కచ్చతీవు దీవి’ని శ్రీలంకకు అప్పగించినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా బహిర్గతమైంది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందించారు. ‘ఆశ్చర్యం వేసింది.. కచ్చతీవు దీవిని కాంగ్రెస్ నిర్మొహమాటంగా శ్రీలంకకు అప్పగించిందనే నిజం వెలుగులోకి వచ్చింది.. కాంగ్రెస్‌ను విశ్వసించలేం.. ప్రతి భారతీయుడికి ఈ ఘటన ఆగ్రహం తెప్పిస్తుంది.. ఎప్పటికీ ఈ దారుణం మన మనసులో నుంచి వెళ్లదు.. దేశ ఐకత్యను, సమగ్రతను, ప్రయోజనాలను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దూరం చేస్తూనే ఉంది’ అని ప్రధాని విమర్శలు గుప్పించారు. యూపీలోని విూరట్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో ఇంతకీ కచ్చతీవు వివాదం ఏంటి? ఈ దీవిని శ్రీలంకకు ఎందుకు అప్పగించారు? అనే చర్చ జరుగుతోంది. భారత్` శ్రీలంకలను వేరుచేసే పాక్ జల సంధిలో రామేశ్వరం దీవికి సవిూపంలో కచ్చతీవు ఉంది. భారత్ తీరానికి 20 కిలోవిూటర్ల దూరంలోని 1.9 కిలోవిూటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దీవి విషయంలో 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే శ్రీలంకకు కచ్చతీవును అప్పగించారు. అయితే, ఆ దీవిలో ఎవరూ నివాసం ఉండరు, కేవలం మత్స్స సంపదే ఉంటుంది. భారత మత్స్యకారులు అక్కడే ఎక్కువగా వేట సాగిస్తుంటారు.కానీ, ఇటీవల కాలంలో శ్రీలంక సైన్యం భారత జాలర్లపై దాడులు చేయడం, వారిని నిర్బంధించడం వంటివి చేస్తుంది. ఒప్పందం ప్రకారం భారత మత్స్సకారులకు ప్రవేశం ఉన్నప్పటికీ శ్రీలంక తిలోదకాలు ఇచ్చింది. అలాగే, కచ్చతీవులో ఉండే సెయింట్ ఆంటోనీ చర్చిలో ఏటా జరిగే జాతరలో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.తమిళనాడు రామేశ్వరం దీవికి సవిూపంలో భారత్` శ్రీలంకను వేరుచేస్తున్న పాక్ జలసంధిలో ఉంది. ఈ జలసంధి రెండుదేశాలకు సరిహద్దుగా ఉంటోంది. పాక్ బే, బంగాళాఖాతంతో ఈ జలసంధి కలుపుతోంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించారు. ఇది చాలా చిన్నదీవి. ఎవరూ ఉండరు. అయితే దీనిపరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్న నెపంతో వీరిపై దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తోంది. ఈ దీవిలో భారత్ మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నా.. శ్రీలంక ఖాతరు చేయడం లేదు. ఇక్కడ సెయింట్ ఆంటోనీ అనే ప్రార్థనామందిరం ఉంది. ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు.భారత రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. 1958లో భారత్`తూర్పు పాకిస్థాన్‌ల మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది. భారత ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్థాన్ గవర్నర్ ఫిరోజ్‌ఖాన్ నూన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) ఇచ్చారు. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో అంశం సుప్రీం కోర్టుకు చేరింది. మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని పేర్కొంది. దీంతో 1960లో రాజ్యాంగ సవరణ చేసి కొంతప్రాంతాన్ని తూర్పు పాక్‌కు ఇచ్చారు. కచ్చతీవు స్వాతంత్య్రం రాకపూర్వం రామ్‌నాడ్ పాలకుల ఆధీనంలో ఉండేది. ప్రస్తుతం రామేశ్వరం సహా పలుదీవులపై రామ్‌నాడ్ జవిూందారుల పాలన సాగేది. అనంతరం భారత్‌లో చేరడం, తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు జరిగింది. న్యాయపరంగా చూస్తే ఈ అప్పగింత చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి.రామేశ్వరం సహా పలుదీవులు మొదట్లో రామ్‌నాథ్ పాలకుల ఆధీనంలో ఉండేది. తర్వాత అది భారత్‌లో విలీనం కావడం, మద్రాసు రాష్ట్రం ఏర్పడటం జరిగింది. ఇక న్యాయపరంగా చూస్తే దీవిని అప్పగించడం చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు అప్పగించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా శ్రీలంకకు దీవిని ఇచ్చేస్తారని ప్రశ్నిస్తున్నారు.తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ ద్వారా కచ్చతీవులపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సమాధానం ఇస్తూ.. ‘స్వాతంత్య్రం వచ్చిన వెంటనే శ్రీలంక.. తమ అనుమతి లేకుండా భారత నావికాదళం (అప్పటి రాయల్ ఇండియన్ నేవీ) కచ్చతీవులో విన్యాసాలు నిర్వహించకూడదని ప్రకటించింది… అక్టోబర్ 1955లో సిలోన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ విన్యాసాలు నిర్వహించింది. మే 10, 1961లో నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ సమస్యను అసంబద్ధం అని కొట్టిపారేశారు. ‘నేను ఈ చిన్న ద్వీపానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వను.. దానికి మా వాదనలను వదులుకోవడానికి నేను ఏ మాత్రం సంకోచించను.. ఇది నిరవధికంగా పెండిరగ్‌లో ఉండటం, పార్లమెంటులో మళ్లీ లేవనెత్తడం నాకు ఇష్టం లేదు’ అని నెహ్రూ పేర్కొన్నట్టు అప్పటి కామన్వెల్త్ సెక్రటరీ వైడీ గుండేవియా రూపొందించిన నోట్‌ను పంచుకుంది.1974 వరకు అధికారికంగా వదులుకునే వరకు భారత్ ప్రతిస్పందనలో అనిశ్చితిని ఇది తెలియజేస్తుందని తెలిపింది. ‘ప్రశ్న చట్టపరమైన అంశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి.. ఈ మంత్రిత్వ శాఖలో ప్రశ్న కొంత వివరంగా పరిగణించింది.. భారత్ లేదా సిలోన్ సార్వభౌమాధికారం దావా బలం గురించి స్పష్టమైన ముగింపు తీసుకోలేం’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇక, అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన ఈ ద్వీపంపై భారత్ బలమైన వాదన వినిపించిందని 1960లో నాటి అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాద్ అభిప్రాయపడ్డారు. ద్వీపం, దాని చుట్టూ ఉన్న మత్స్య సంపద, ఇతర వనరులపై రామనాథపురం రాజుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చిన జవిూందారీ హక్కులను ఉదాహరణగా చూపారు. మద్రాస్ రాష్ట్రం జవిూందారీ హక్కులను రద్దుచేసేవరకూ 1875 నుంచి 1948 వరకూ నిరంతరాయంగా ఈ అధికారాలను అనుభవించారు.1958లో ఈ భూభాగం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మన దేశానికి చెందిన భూభాగాలను వేరే ప్రాంతాలకు ఇవ్వొద్దని సూచించింది. నాటి ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్థాన్ గవర్నర్ ఫిరోజ్ ఖాన్‌ల మధ్య జరిగిన బెరుబరి ఒప్పందం విషయంలోనే సుప్రీం తీర్పు ఇచ్చింది. దీంతో 1960లో రాజ్యాంగ సవరణ ద్వారా కొంత ప్రాంతాన్ని తూర్పు పాక్‌కు ఇచ్చారు.కాగా, ఈ ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడాన్ని పార్లమెంట్‌లో అప్పటి డీఎంకే ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. డీఎంకే ఎంపీ ఎరా సెజియన్ 1974 జులై 23న లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ‘ఎలాంటి నిబంధనలు లేకుండా మన భూభాగాన్ని పూర్తిగా అప్పగించడం దేశ ప్రయోజనాలకు విరుద్ధం.. ఇది అనర్హమైన, అపవిత్రమైన, అవమానకరమైన చర్య. అందుచేత, గౌరవనీయులైన విదేశాంగ మంత్రి చేయబోయే ప్రకటనతో మాకు సంబంధం లేదు.. మేము సభ నుంచి బయటకు వెళ్లడం ద్వారా వ్యతిరేకతను తెలియజేస్తున్నాం’ అని ప్రకటన చేశారు.