తిరువనంతపురం, మార్చి 18:కేరళలో చికెన్ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుకున్నాయి. వరిసెల్లా`జోస్టర్ వైరస్ ద్వారా చికెన్ పాక్స్ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మార్చి 15 వరకు రాష్ట్రంలో 6,744 ఇన్ఫెక్షన్ కేసులు, పిల్లలతో సహా తొమ్మిది మరణాలు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత ఏడాది రాష్ట్రంలో మొత్తం నాలుగు మరణాలు, 26,363 చికెన్ పాక్స్ కేసులు నమోదైనట్లు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వద్ద ఉన్న గణాంకాలు చెబుతున్నాయి.ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటువ్యాధి, చికెన్ ఫ్యాక్స్ సోకిన వ్యక్తితో శారీరక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది’ అని కేరళలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. శిశువులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణీల విషయంలో ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే పిండానికి హాని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, సమస్యలు మరణానికి కూడా దారితీయవచ్చు’’ అని ఆయన అన్నారు.ఎర్నాకుళం జిల్లాలో చికెన్పాక్స్ కేసులు పెరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని చర్మ గాయాలు నయం అయ్యే వరకు రోగులు తమను తాము ఐసోలేట్ చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించడంలో సహాయపడతారని డాక్టర్ రాజీవ్ చెప్పారు. ఇక కేరళలోని ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సల్ఫీ నూహు మాట్లాడుతూ.. సాధారణంగా వేసవికి ముందు వ్యాప్తి సంభవిస్తుంది. ‘‘దాదాపు అన్ని సీజన్లలో ఈ వ్యాధి వ్యాప్తి కనిపిస్తుంది. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలకు అనుగుణంగా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
‘‘వ్యాక్సినేషన్ ఒక వ్యక్తికి చికెన్ పాక్స్ సోకకుండా నిరోధించగలదు. అలాగే మెరుగైన ట్రీట్ మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని డాక్టర్ సల్ఫీ చెప్పారు. చికిత్స ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. అనారోగ్యం తీవ్రతతో చికిత్స ప్రభావం తగ్గవచ్చు. సాధారణంగా వృద్ధులు, కోమార్బిడిటీస్ ఉన్నవారికి వ్యాక్సినేషన్ సిఫార్సు చేస్తారు’ అని డాక్టర్ సల్ఫీ తెలిపారు.