హైదరాబాద్‌ మార్చ్‌ 14:జంతువులకూ మనసు ఉంటుంది. కరుణ, ఆపేక్ష ఉంటాయి. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. కొన్నాళ్లు పోషించిన తర్వాత వాటిని అడవిలో వదిలేసినా, మళ్లీ కనబడితే చాలు అక్కున చేర్చుకుంటాయి. పెద్ద పులులు, సింహాల వంటి క్రూర జంతువులు కూడా ఇందుకు మినహాయింపు కాదు.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. ఓ ఏనుగు ఎన్నో ఏళ్లపాటు ఓ కేర్‌ టేకర్‌ సంరక్షణలో ఉంది. అయితే అతను అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. కేర్‌ టేకర్‌ కనిపించకపోవడంతో ఏనుగు చాలా దిగులు పడిరది. అతనికి ఒంట్లో బాగోలేదన్న సంగతిని ఇతర కేర్‌ టేకర్ల ద్వారా తెలుసుకున్న ఏనుగు, అతన్ని చూసేందుకు ఏకంగా ఆస్పత్రికి వచ్చింది. తన కేర్‌ టేకర్‌ చికిత్స పొందుతున్న గది గుమ్మం ఎత్తు తక్కువగా ఉండటంతో మోకాళ్లపై వంగి లోపలికి వచ్చిన ఏనుగు, అవసాన దశలో ఉన్న కేర్‌ టేకర్‌ ను చూసి కన్నీరు పెట్టుకుంది. తొండంతో అతన్ని తట్టిలేపేందుకు ప్రయత్నించింది. అనారోగ్యం కారణంగా కేర్‌ టేకర్‌ పైకి లేవలేకపోయాడు. ఇది గమనించిన అతని సహాయకురాలు, అతని చేతిని పైకెత్తి ఏనుగు తొండానికి తాకించింది. ఈ వీడియో చూసిన ఎంతోమంది ఏనుగు దయార్ద్రహృదయానికి జోహార్లు అర్పించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *