తిరుపతి: రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలవుతాయి అనే సామెత సత్యవేడు ఎన్నికల రాజకీయాల్లో నిరూపితమయ్యాయి. సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం పేరును మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం అధికారికంగా ప్రకటించారు. కాసేపటి క్రితం చంద్రబాబు నాయుడు టిడిపి అభ్యర్థుల సంబంధించి రెండో జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అభ్యర్థుతాన్ని టిడిపి ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం పోటీ చేసి దాదాపు 40 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అయితే సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఈసారి సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించకుండా ఎంపీ స్థానానికి ఇన్చార్జిగా ఆదిమూలం పేరును వైఎస్‌ఆర్సిపి హైకమాండ్ ప్రకటించింది.
దీనిపై కోనేటి ఆదిమూలం అసంతృప్తి వెళ్లగక్కారు.తనకు అసెంబ్లీ సీటు రాకుండా చేయడంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి హస్తము ఉన్నట్లు ఆయన విూడియా ముందు ధ్వజం ఎతడంతో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను వెను వెంటనే కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో సత్యవేడు అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం పేరును ప్రకటించింది.