విజయవాడ, మార్చి 14: టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలిజాబితాలో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది.రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రాంనారాయణ రెడ్డి, దెందలూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ`జనసేన`బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ పోటీ చేయాల్సిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తోంది.టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. రెండో జాబితాలో పీహెచ్‌డీ చేసిన వారు ఒక్కరు, పీజీ చేసిన వారు 11మంది, గ్రాడ్యుయేట్లు తొమ్మిది మంది, ఇంటర్మీడియట్ చదివిన వారు ఎనిమిది మంది, 10వ తరగతి చదివిన వాళ్లు ఐదుగురు ఉన్నారు.రెండు జాబితాలోనూ సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్లు లేవు. గురజాల టికెట్ యరపతినేని శ్రీనివాసరావు దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో సస్పెన్స్ కొనసాగుతోంది.
నరసన్నపేట ` బగ్గు రమణమూర్తి
గాజువాక ` పల్లా శ్రీనివాసరావు
చోడవరం` కె.ఎస్.ఎన్.ఎస్. రాజు
మాడుగుల ` పైలా ప్రసాద్
ప్రత్తిపాడు` వరుపుల సత్యప్రభ
రామచంద్రపురం ` వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ `గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం ` మిర్యాల శిరిష
కొవ్వూరు `ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు` చింతమనేని ప్రభాకర్
గోపాలపురం` మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు ` భాష్యం ప్రవీణ్
గుంటూరు పశ్చిమ ` పిడురాళ్ల మాధవీ
గుంటూరు తూర్పు ` మహ్మద్ నజీర్
గురజాల ` యరపతినేని శ్రీనివాసరావు
కందకూరు ` ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం ` కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు`ముత్తుముళ్ల అశోక్ రెడ్డి
ఆత్మకూరు` ఆనం రామనారాయణరెడ్డి
కోవూరు ` వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వెంకటగిరి R కురుగొండ్ల లక్ష్మిప్రియ
కమలాపురం` పుత్తా చైతన్యరెడ్డి
ప్రొద్దుటూరు `వరదరాజులురెడ్డి
నందికొట్కూరు ` గిత్తా జయసూర్య
కదిరి ` కందికుంట యశోదా దేవి
పుట్టపర్తి ` పల్లె సింధూరా రెడ్డి
మంత్రాలయం ` రాఘవేంద్ర రెడ్డి
ఎమ్మిగనూరు ` జయనాగేశ్వర రెడ్డి
పూతలపట్టు ` డాక్టర్ కలికిరి మురళీమోహన్
సత్యవేడు ` కోనేటి ఆదిమూలం
శ్రీకాళహస్తి ` బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
చంద్రగిరి ` పులివర్తి వెంకట మణి ప్రసాద్
పుంగనూరు ` చల్లా రామచంద్రారెడ్డి
మదనపల్లి ` షాజహాన్ బాషా